News December 2, 2024
ప్రభాస్ ‘స్పిరిట్’లో కియారా స్పెషల్ సాంగ్?

సందీప్ రెడ్డి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇటీవలే సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కియారా ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తారని సమాచారం. త్వరలోనే మూవీకి సంబంధించిన అప్డేట్స్‌ను మేకర్స్ వెల్లడించనున్నారు.
Similar News
News February 18, 2025
నేటి ముఖ్యాంశాలు

* రాబోయే 3 నెలలు చాలా కీలకం: CM రేవంత్
* TG: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం
* KCRకు తెలుగు రాష్ట్రాల CMలు బర్త్ డే విషెస్
* ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం: CM CBN
* రాజకీయాల్లోకి మళ్లీ రాను: కేశినేని నాని
* వచ్చే నెల 14న పిఠాపురంలో జనసేన ప్లీనరీ
* మహాకుంభమేళా@54.31 కోట్ల మంది
* ఉత్తర భారతంలో భూప్రకంపనల కలకలం
* 2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు
News February 18, 2025
BREAKING: కొత్త CECగా జ్ఞానేశ్ కుమార్

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC)గా జ్ఞానేశ్ కుమార్ ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జ్ఞానేశ్ కుమార్ పేరు గత కొన్ని రోజులుగా అందరి నోటా నానుతుండగా ఈరోజు అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రస్తుత CEC రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనుంది.
News February 18, 2025
ఎండాకాలం: ఈసారి హాటెస్ట్ సిటీగా బెంగళూరు!

దేశంలో ఈసారి ఎండలు మండిపోతాయని, అత్యంత వేడి నగరంగా బెంగళూరు నిలవనుందని IMD అంచనా వేసింది. ఏటా వేసవిలో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఢిల్లీ కంటే బెంగళూరులోనే రికార్డ్ స్థాయి టెంపరేచర్ నమోదవుతుందని పేర్కొంది. సిలికాన్ సిటీలో ఇవాళ 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఢిల్లీలో 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదవడం గమనార్హం.