News January 24, 2025
CID చేతికి కిడ్నీ రాకెట్ కేసు: మంత్రి దామోదర

TG: హైదరాబాద్‌లోని అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసును CIDకి అప్పగించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా 6 నెలలుగా ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.50 లక్షలు వసూలు చేశారని సమాచారం.
Similar News
News February 12, 2025
గాజా పాలస్తీనీయులదే.. ఖాళీ చేయకూడదు: చైనా

గాజా నుంచి పాలస్తీనీయుల్ని ఖాళీ చేయించి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల్ని చైనా ఖండించింది. ‘గాజా అనేది పాలస్తీనీయులకు మాత్రమే చెందినది. అది వారి భూభాగం. అక్కడి నుంచి పాలస్తీనీయుల్ని బలవంతంగా ఖాళీ చేయించే ఆలోచనను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొంది. అటు అరబ్ లీగ్ కూడా అమెరికా ఆలోచనను తప్పుబట్టింది. అరబ్ ప్రపంచం దాన్ని ఆమోదించబోదని తేల్చిచెప్పింది.
News February 12, 2025
‘కింగ్డమ్’ టీజర్‌పై రష్మిక స్పెషల్ పోస్ట్

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘కింగ్డమ్’ సినిమా నుంచి రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది. దీనిపై VD ఫ్రెండ్, హీరోయిన్ రష్మిక మందన్న స్పందిస్తూ ఇన్‌స్టాలో స్పెషల్ పోస్ట్ చేశారు. ‘ఇతడు ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వస్తాడు. విజయ్ నిన్ను చూసి నేను గర్విస్తున్నా’ అని రష్మిక పేర్కొన్నారు. విజయ్ కొత్త సినిమా టీజర్ మీకు నచ్చిందా? కామెంట్ చేయండి.
News February 12, 2025
RTC బస్సు ఢీకొని మహిళ మృతి.. రూ.9 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశం

USలో ఉద్యోగం చేసే లక్ష్మీ 2009లో INDకు వచ్చి ఫ్యామిలీతో కలిసి కారులో రాజమండ్రి వెళ్తుండగా APSRTC బస్సు ఢీకొట్టింది. లక్ష్మీ మృతి చెందడంతో RTC నుంచి రూ.9Cr పరిహారం ఇప్పించాలని ఆమె భర్త శ్యాం మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ట్రిబ్యునల్ రూ.8.05Cr చెల్లించాలని చెప్పింది. అయితే RTC HCకి వెళ్లగా రూ.5.75Crకు తగ్గించింది. దీన్ని శ్యాం SCలో సవాల్ చేయగా రూ.9Cr చెల్లించాలని తాజాగా ఆదేశించింది.