News September 26, 2024
కిల్లర్ మిల్లర్ @ టీ20ల్లో 500 మ్యాచుల రికార్డ్

సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పారు. 500 T20లు ఆడిన ఆరో క్రికెటర్గా అవతరించారు. CPLలో BRvsGAW మ్యాచుతో అతడీ ఘనత సాధించారు. 34 బంతుల్లో 71* రన్స్ చేసినా BRని గెలిపించలేకపోయారు. మిల్లర్ 500 T20ల్లో 34.89 AVG, 137 SRతో 10,678 రన్స్ చేశారు. 455 ఇన్నింగ్సుల్లో 48 ఫిఫ్టీస్, 4 సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 120*. ప్రపంచ వ్యాప్తంగా అనేక టీ20 లీగులు ఆడిన అనుభవం అతడికుంది.
Similar News
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<
News December 13, 2025
₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

TG: కుల, మతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్య అందించేలా యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘CM విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ₹21వేల కోట్లతో ఈ స్కూళ్ల భవనాలు నిర్మిస్తున్నాం. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ₹642 కోట్లతో స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని వివరించారు. నైపుణ్యాల పెంపునకు ITIలలో ATCలను నెలకొల్పుతున్నట్లు వివరించారు.
News December 13, 2025
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు: DGP

<<18552173>>కోల్కతా ఘటన<<>> నేపథ్యంతో HYD ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు DGP శివధర్ రెడ్డి తెలిపారు. ‘కోల్కతా ఘటన తర్వాత మరోసారి ఏర్పాట్లపై సమీక్షించాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గ్రౌండ్లోకి ఫ్యాన్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మెస్సీ 7.15PMకి స్టేడియానికి వస్తారు. మ్యాచ్ 20min జరుగుతుంది. చివరి 5minలో CM, మెస్సీ మ్యాచ్ ఉంటుంది’ అని తెలిపారు.


