News September 26, 2024

కిల్లర్ మిల్లర్ @ టీ20ల్లో 500 మ్యాచుల రికార్డ్

image

సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పారు. 500 T20లు ఆడిన ఆరో క్రికెటర్‌గా అవతరించారు. CPLలో BRvsGAW మ్యాచుతో అతడీ ఘనత సాధించారు. 34 బంతుల్లో 71* రన్స్ చేసినా BRని గెలిపించలేకపోయారు. మిల్లర్ 500 T20ల్లో 34.89 AVG, 137 SRతో 10,678 రన్స్ చేశారు. 455 ఇన్నింగ్సుల్లో 48 ఫిఫ్టీస్, 4 సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 120*. ప్రపంచ వ్యాప్తంగా అనేక టీ20 లీగులు ఆడిన అనుభవం అతడికుంది.

Similar News

News July 6, 2025

టెక్సాస్ వరదలు.. 32కు చేరిన మృతుల సంఖ్య

image

అమెరికాలోని టెక్సాస్‌లో అకాల వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెర్ కౌంటీ షెరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరదల వల్ల చనిపోయినవారి సంఖ్య 32కు చేరుకుంది. మృతుల్లో 18 మంది పెద్దవాళ్లుకాగా.. 14 మంది చిన్నారులు ఉన్నారు. గల్లంతైన 27 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. రికవరీ చేసిన 8 మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోతున్నారు. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు ట్రంప్ సానుభూతి తెలియజేశారు.

News July 6, 2025

తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

image

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.

News July 6, 2025

ప్రపంచస్థాయి కెమికల్ హబ్స్ రావాలి: నీతిఆయోగ్

image

ప్రపంచస్థాయి కెమికల్స్ హబ్స్ స్థాపనపై కేంద్రం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ ఓ నివేదికలో పేర్కొంది. ‘అత్యధిక సామర్థ్యాలుండే 8 పోర్ట్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌నూ స్థాపించాలి. 2040నాటికి భారత్ లక్షకోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో గ్లోబల్ వ్యాల్యూ చెయిన్‌లో 3.5%గా ఉన్న వాటా 2040నాటికి 4-5శాతానికి పెరగనుంది. 2030నాటికి 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది’ అని నివేదికలో వివరించింది.