News May 10, 2024

వ్యాపారంలోనూ ‘కింగ్’ కోహ్లీనే!

image

స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కెరీర్‌తో పాటు వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. 2020లో ‘గో డిజిట్’ అనే ఇన్సూరెన్స్ స్టార్టప్‌లో ఈ జంట రూ.2.5కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈనెల 15-17 తేదీల్లో ఆ సంస్థ IPO అందుబాటులోకి రానుంది. ఒక్కో షేర్ ధర రూ.258-272 మధ్య ఉండటంతో వీరి సంపద రూ.9.06 కోట్లకు (రూ.6.56కోట్ల లాభం) చేరనుంది. కాగా కోహ్లీ 2,66,667 షేర్లు, అనుష్క 66,667 షేర్లు కొనుగోలు చేశారు.

Similar News

News September 18, 2025

ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

image

EPFO <>వెబ్‌సైట్‌లో<<>> పాస్‌బుక్ కోసం ప్రత్యేకంగా లాగిన్ అయ్యే అవసరాన్ని సంస్థ తగ్గించింది. ఇకపై మెంబర్ పోర్టల్‌లోనే పీఎఫ్ లావాదేవీలను చెక్ చేసుకునేలా పాస్‌బుక్ లైట్ పేరిట కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల సింగిల్ లాగిన్‌తోనే అన్ని వివరాలు చెక్ చేసుకోవచ్చు. అటు ఉద్యోగి పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ కూడా పోర్టల్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉండనుంది.

News September 18, 2025

నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

image

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష‌హోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.

News September 18, 2025

విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

image

ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఓపెనర్ ఫ్రైలింక్ విధ్వంసం సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మొత్తం 31 బంతుల్లో 77 రన్స్ చేసి ఔట్ అయ్యారు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఫ్రైలింక్ బాదుడుతో నమీబియా 20 ఓవర్లలో 204/7 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో జింబాబ్వే ఎదురొడ్డుతోంది.