News August 14, 2024

క్రికెట్‌కు కివీస్ ప్లేయర్ గుడ్ బై

image

న్యూజిలాండ్ ప్లేయర్ జార్జ్ వర్కర్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. వర్కర్ కివీస్ తరఫున 10 వన్డేలు ఆడి 272, 2 టీ20ల్లో 90 పరుగులు చేశారు. 2015-18 మధ్య ఆయన న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. కాగా ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16,601 పరుగులు సాధించారు. ఇందులో 30 శతకాలు ఉన్నాయి.

Similar News

News September 10, 2024

టాప్ డైరెక్టర్లతో యంగ్‌టైగర్.. పిక్స్ వైరల్

image

టాప్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, కొరటాల శివ, అయాన్ ముఖర్జీతో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీ ట్రైలర్ ఇవాళ ముంబైలో విడుదల కానుండటంతో వీరందరూ అక్కడ కలుసుకున్నారు. కాగా ఈ ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. కొరటాలతో ‘దేవర’, నీల్‌తో ‘NTR31’, అయాన్‌తో ‘వార్ 2’ సినిమాలు చేస్తున్నారు.

News September 10, 2024

భారత్ రానున్న జెలెన్‌స్కీ?

image

ఈ ఏడాది చివరి నాటికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ రాయబారి అలెగ్జాండర్ పోలిష్‌చుక్ తెలిపారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా జెలెన్‌స్కీని మోదీ ఆహ్వానించారని, అది జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తమ అధ్యక్షుడు కూడా ఇక్కడ పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

News September 10, 2024

సముద్రపు నీరు ఎందుకు ఉప్పగా ఉంటుంది?

image

సముద్రాల్లోని నీరు సూర్యుడి వేడికి ఆవిరై మేఘాలుగా వర్షించి నదుల్లోకి చేరుతుంది. ఆ నది సముద్రంలోకి వచ్చే క్రమంలో అనేక ప్రదేశాల్లో ప్రవహిస్తూ ఆయా ప్రాంతాల లవణాలను తనలో కలుపుకొంటూ సముద్రంలో చేరుతుంది. నీటి గాఢత తక్కువగా ఉండటంతో నదుల్లో నీరు ఉప్పగా అనిపించదు. కానీ సాగరాల్లో లవణాలు ఎటూ పోయే దారి ఉండదు. అటు సముద్రాల అడుగున భూమి పొరల నుంచి కూడా లవణాలు అందులో కలుస్తుండటంతో ఆ నీరు ఉప్పగా ఉంటుంది.