News March 29, 2024

విజయలక్ష్మి ఒత్తిడితోనే కేకే పార్టీ మారుతున్నారు: విప్లవ్

image

TG: కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న తన తండ్రి కే కేశవరావు నిర్ణయం బాధించిందని ఆయన కుమారుడు విప్లవ్ కుమార్ అన్నారు. ‘గతంలో పొన్నాల లక్ష్మయ్య వయసు గురించి సీఎం రేవంత్ విమర్శించారు. మరి 84 ఏళ్ల కేకేను ఎలా పార్టీలో చేర్చుకుంటారు? మేయర్ విజయలక్ష్మి ఒత్తిడితోనే కేకే పార్టీ మారుతున్నారు. ఆయన ఇప్పటికైనా పునరాలోచన చేయాలి. విజయలక్ష్మి బీఆర్ఎస్‌కు తీరని ద్రోహం చేశారు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News February 16, 2026

2 అల్పపీడనాలు.. వర్ష సూచన!

image

దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, శ్రీలంకలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నెల 19 తర్వాత ఉపరితల ఆవర్తనం ఏర్పడి, అల్పపీడనంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఈ నెల 25 నుంచి 28 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

News February 16, 2026

జీడిమామిడిలో అంతర పంటలు.. లాభాలు

image

జీడిమామిడి తోటల్లో తొలి ఏడాది అంతర పంటల సాగుకు అనుకూలం. దీని వల్ల కలుపు ప్రభావం తగ్గుతుంది. ఈ తోటల్లో వర్షాధారంగా కర్రపెండలం, పెసలు, మినుము, పశుగ్రాసాలు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పైనాపిల్‌ను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. దీని వల్ల భూసారంతో పాటు, జీడిమామిడిలో దిగుబడులు కూడా పెరుగుతాయి. అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. అయితే ఈ అంతరపంటలకు కూడా జీడిమామిడితో పాటు సక్రమంగా ఎరువులను అందించాలి.

News February 16, 2026

ఉపవాసం విరమించే ముందు..

image

ఉపవాసాన్ని విరమించే ముందు ఇంట్లో శివునికి నైవేద్యం సమర్పించాలి. అలాగే దీపారాధన కూడా చేయాలి. వీలైతే పేదలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అన్నదానం తర్వాత ఉపవాసం విరమిస్తే వచ్చే పుణ్యం అనంతం. పారణ చేసేటప్పుడు ‘ఓం నమః శివాయ’ మంత్రం జపించాలని పండితులు సూచిస్తున్నారు. భగవంతునిపై మనసు లగ్నం చేసిన తర్వాత పాటించే ఈ పరిహారాలు అనంత పుణ్యాన్ని ఇస్తుంది. అందుకే విరమణ తర్వాత కూడా ప్రశాంతంగా, భక్తితో ఉండాలి.