News May 25, 2024
KKRదే కప్: హెడెన్

ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా KKR నిలుస్తుందని ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ జోస్యం చెప్పారు. ఫైనల్‌కు ముందు వారికి మూడు రోజుల విశ్రాంతి లభించడమే అందుకు కారణమన్నారు. ఈ సమయంలో SRH బలాలు, బలహీనతలపై KKR ఫోకస్ చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక క్వాలిఫయర్-1లో ఆ జట్టును ఓడించిన కాన్ఫిడెన్స్ కూడా KKRకు కలిసొస్తుందని హెడెన్ అంచనా వేశారు. మరి ఆయన కామెంట్స్‌పై మీరేమంటారు?
Similar News
News February 16, 2025
ఏప్రిల్‌లో మత్స్యకారులకు రూ.20,000: మంత్రి

AP: ఏటా JANలో జాబ్ క్యాలెండర్, మెగా DSC అంటూ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. MLC ఎన్నికలు ముగియగానే తమ ప్రభుత్వం 16,247 పోస్టులతో DSC విడుదల చేస్తుందని పునరుద్ఘాటించారు. జూన్‌కు ముందే నియామకాలు పూర్తి చేస్తామని, ‘తల్లికి వందనం’ అందిస్తామని చెప్పారు. సముద్రంలో చేపల వేట నిషేధిత రోజులకు గాను మత్స్యకారులకు APRలో ₹20K, MAYలో ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తామన్నారు.
News February 16, 2025
మస్తాన్ సాయి కేసు.. గవర్నర్‌కు లావణ్య లాయర్ లేఖ

AP: <<15471142>>మస్తాన్‌సాయి<<>> కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య తరఫు లాయర్ లేఖ రాశారు. అతని నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అలాగే సీఎస్, గుంటూరు కలెక్టర్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి కూడా లేఖలు రాశారు.
News February 16, 2025
సీఎం రేవంత్‌కు సబ్జెక్ట్ లేదు: ఎంపీ అర్వింద్

TS: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎంపీ అర్వింద్ విమర్శించారు. ప్రపంచ దేశాలు మోదీని గౌరవిస్తుంటే, ఆయన కులంపై సీఎం విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్‌కు సబ్జెక్ట్ లేదని, అడ్మినిస్ట్రేషన్‌లోనూ ఆయన విఫలమయ్యారన్నారు. కులగణనలో కోటి మంది ప్రజల లెక్క తెలియలేదని దుయ్యబట్టారు.