News May 19, 2024

KKR Vs RR: టాస్ ఆలస్యం

image

రాజస్థాన్, కోల్‌కతా మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారింది. మ్యాచ్ జరుగుతున్న గుహవాటిలోని బార్సాపారా స్టేడియం వద్ద వాన పడుతోంది. దీంతో టాస్ ఆలస్యంగా వేయనున్నారు.

Similar News

News December 10, 2024

తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి

image

ప్రోకబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ దారుణంగా ఓడిపోయింది. హరియాణా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచులో 46-25 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. TTలో ఆశిష్ నర్వాల్ సూపర్ 10 సాధించారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం హరియాణా స్టీలర్స్, పట్నా పైరెట్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

News December 10, 2024

కాలుష్యాన్ని నియంత్రించే బ్యాక్టీరియా.. IIT గువాహటి శాస్త్రవేత్తల ఆవిష్కరణ

image

బ్యాక్టీరియా ద్వారా మీథేన్, కార్బన్ డయాక్సైడ్‌ను శుద్ధమైన బయోఫ్యూయల్‌గా మార్చే విధానాన్ని IIT గువాహటి శాస్త్రవేత్తలు ఆవిష్క‌రించారు. Prof.దేవాశిష్, కళ్యాణి సాహు బృందం ఆవిష్క‌రించిన‌ ఈ విధానం ద్వారా మెథానోట్రోఫిక్ బ్యాక్టీరియా కాలుష్య కారకాలను శుద్ధిచేస్తుంది. ప్ర‌యోగ ద‌శ‌లో ఉన్న ఈ న‌మూనా ప్ర‌స్తుతం 5L ప‌రిమాణంలో ఉంది. ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ఇంధ‌న ఆవిష్క‌ర‌ణ‌లో ఇది కీల‌క ముంద‌డుగ‌ని వారు పేర్కొన్నారు.

News December 9, 2024

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ఎప్పటి నుంచంటే?

image

AP: రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు TDP MLA యార్లగడ్డ వెంకట్ రావు FBలో పోస్ట్ పెట్టారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రీ బస్ వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే పనిలో ఉందని వెల్లడించారు.