News May 12, 2024
KKRvsMI: ప్లే ఆఫ్స్ చేరిన కోల్‌కతా

ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన KKRvsMI మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా 18 పరుగులతో విజయం సాధించింది. 16 ఓవర్లలో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన MI 139 పరుగులకే పరిమితమైంది. ఇషాన్ కిషన్(40 రన్స్) ఒక్కరే రాణించారు. KKR బౌలర్లలో హర్షిత్ రాణా, రస్సెల్, వరుణ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఈ విజయంతో 18 పాయింట్లకు చేరిన కేకేఆర్, ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.
Similar News
News February 11, 2025
రంగరాజన్‌పై దాడిని ఖండించిన చంద్రబాబు

AP: చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని హితవు పలికారు. గౌరవప్రదమైన చర్చలు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి కానీ హింసకు కాదని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల రంగరాజన్‌పై దాడిని టీజీ సీఎం రేవంత్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ తదితర రాజకీయ ప్రముఖులు ఖండించిన విషయం తెలిసిందే.
News February 11, 2025
డయాబెటిస్ ఉన్నా ఈ పండ్లు తినొచ్చు

తీపి పండ్లు తినాలని అనిపిస్తున్నా డయాబెటిస్ ఎక్కువవుతుందని మధుమేహులు భయపడుతుంటారు. రాస్ప్‌బెరీ, అవకాడో, ఆప్రికాట్, బ్లాక్‌బెరీ, పుచ్చకాయల్ని వారు తినొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇతర పండ్లతో పోలిస్తే వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుందని, మేలు చేకూర్చే కొవ్వులు ఎక్కువ ఉంటాయని వివరిస్తున్నారు. అయితే మధుమేహులు తమ షుగర్ స్థాయుల్ని బట్టి వైద్యుల సూచన మేరకు డైట్ అనుసరించాలని సూచిస్తున్నారు.
News February 11, 2025
అమరావతికి రూ.11వేల కోట్ల రుణం.. హడ్కో గ్రీన్ సిగ్నల్

AP: రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్ రుణం ఇస్తుండగా, హడ్కో ఇచ్చే అప్పు విషయంలోనూ ముందడుగు పడింది. రూ.11వేల కోట్ల రుణంపై ముంబైలో జరిగిన పాలకమండలి భేటీలో అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత పత్రాలను సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబుకు అందించారు. నాలుగు నెలల్లో లోన్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలని సూచించారు.