News December 18, 2024
నేషనల్ హైవేగా KKY రోడ్డు?
TG: కామారెడ్డి జిల్లాలో మరో నేషనల్ హైవే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత రోడ్డు ఇరుకుగా మారడం, కార్లు, బస్సులు, ఆటోలు, ఇతర గూడ్స్ వెహికల్స్ రాకతో నిత్యం రద్దీ నెలకొంటోంది. కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం వరకు 4 లేన్లుగా మార్చాలని కేంద్రాన్ని కోరనుంది.
Similar News
News January 20, 2025
రెండు రాష్ట్రాలు.. ఒకే ఆత్మ: సీఎం చంద్రబాబు
దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఫొటోను తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ వెయిటింగ్ లాంజ్‌లో అనూహ్యంగా సమావేశమై రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు గురించి చర్చించాం’ అని రేవంత్ రాసుకొచ్చారు. దీనికి సీఎం CBN స్పందిస్తూ.. ‘రెండు రాష్ట్రాలు.. ఒకే ఆత్మ. తెలుగు సమాజం ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలి. TG సీఎం రేవంత్ గారిని కలవడం ఆనందంగా ఉంది’ అని రిప్లై ఇచ్చారు.
News January 20, 2025
కాసేపట్లో ప్రమాణం.. చర్చిలో ట్రంప్ ప్రార్థనలు
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సందడి వాతావరణం నెలకొంది. కాసేపట్లో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్-మెలానియా దంపతులు సెయింట్ జాన్స్ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. వీరి వెంట వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్-ఉష దంపతులు కూడా ఉన్నారు. భారత కాలమానం ప్రకారం రా.10.30 గంటలకు ట్రంప్, వాన్స్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
News January 20, 2025
నూతన అధ్యక్షుడు తొలుత చేసే సంతకాలు ఇవే…!
అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఎన్నికల హామీలపై ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. మెక్సికోతో ఉన్న సరిహద్దును మూసివేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపడం, ఆర్మీలో ట్రాన్స్‌జెండర్ల నియామకానికి అడ్డుకట్ట వేయడంతో పాటు పలు కీలక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.