News May 14, 2024
DCతో మ్యాచుకు KL రాహుల్ దూరం?

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టుకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు జరగనున్న DCvsLSG మ్యాచ్‌కు రాహుల్ దూరం కానున్నట్లు సమాచారం. ఢిల్లీ వెళ్లిన జట్టు సభ్యుల్లో ఆయన కనిపించకపోవడమే ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. SRHతో ఓటమి తర్వాత LSG జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా డగౌట్ వద్ద రాహుల్‌పై సీరియస్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News March 16, 2026
ఈ తప్పులతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి!

ఏమీ తినకున్నా కొన్నిసార్లు బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. దీనికి 4 కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, ఫుడ్ స్కిప్ చేయడం, లేవగానే కాఫీ తాగడం వల్ల అసాధారణంగా షుగర్ పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారికి ఇది హానికరమని అంటున్నారు. ‘రోజూ 7-8గంటలు నిద్రపోవాలి. మెడిటేషన్, యోగా చేయాలి. సమయానికి తినాలి. ఖాళీ కడుపుతో కెఫీన్ పదార్థాలు తాగొద్దు’ అని సూచిస్తున్నారు.

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 11.45AMకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ఈ నెల 20న బడ్జెట్‌ను భట్టి ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కొత్త హాల్‌లో శాసనమండలి కొలువుదీరనుంది. నేడు గవర్నర్, CM చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశాలకు BRS అధినేత KCR హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.