News October 23, 2024
తర్వాతి మ్యాచ్ కోసం కేఎల్ రాహుల్ సాధన

టీమ్ ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. తొలి మ్యాచ్‌లో పంత్, సర్ఫరాజ్ వంటి యువ ఆటగాళ్లు రాణించగా, అనుభవజ్ఞుడైన రాహుల్ 0, 12 రన్స్‌కే ఔటయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ న్యూజిలాండ్ బౌలర్ ఓ రూర్కే బౌలింగ్‌లో రాహుల్ ఔటయ్యారు. దీంతో అదే హైట్ ఉన్న మోర్నే మోర్కెల్ బౌలింగ్‌లో రాహుల్ నెట్స్‌లో సాధన చేశారు. రేపు ఉదయం 9.30 గంటలకు రెండో టెస్టు మొదలుకానుంది.
Similar News
News December 13, 2025
WGL: డబ్బులు అడిగిన విలేకరులను చితకబాదిన నేతలు!

వరంగల్ శివారులో రెండో విడత ప్రచారానికి కవరేజ్‌కు వెళ్లిన ఇద్దరు మీడియా కంట్రిబ్యూటర్లు ప్రచారం ముగిసిన అనంతరం మామూళ్లు అడిగినట్టు ఆరోపణలు వచ్చాయి. డబ్బుల విషయంలో వివాదం చెలరేగగా, ఆగ్రహించిన పార్టీ శ్రేణులు మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కొని తరిమినట్లు సమాచారం. గ్రామశివారు వరకు వెంబడించి దాడి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అనంతరం వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా ఓ MLA ఆదేశాలతో ఇరుపక్షాలు రాజీ పడ్డాయి.
News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.
News December 13, 2025
MECON లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<


