News October 23, 2024
తర్వాతి మ్యాచ్ కోసం కేఎల్ రాహుల్ సాధన
టీమ్ ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. తొలి మ్యాచ్‌లో పంత్, సర్ఫరాజ్ వంటి యువ ఆటగాళ్లు రాణించగా, అనుభవజ్ఞుడైన రాహుల్ 0, 12 రన్స్‌కే ఔటయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ న్యూజిలాండ్ బౌలర్ ఓ రూర్కే బౌలింగ్‌లో రాహుల్ ఔటయ్యారు. దీంతో అదే హైట్ ఉన్న మోర్నే మోర్కెల్ బౌలింగ్‌లో రాహుల్ నెట్స్‌లో సాధన చేశారు. రేపు ఉదయం 9.30 గంటలకు రెండో టెస్టు మొదలుకానుంది.
Similar News
News November 2, 2024
ఇంకెంత మంది బాలికలు బలవ్వాలి పవన్?: వైసీపీ
AP: పవన్ కళ్యాణ్ కక్ష సాధింపులపై కాకుండా శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని వైసీపీ ట్వీట్ చేసింది. తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై <<14509648>>హత్యాచార<<>> ఘటనను మెన్షన్ చేస్తూ విమర్శలు గుప్పించింది. ‘మీ చేతగానితనంతో ఇంకెంత మంది బాలికలు ఇలా బలి అవ్వాలి పవన్ కళ్యాణ్?’ అని ప్రశ్నించింది.
News November 2, 2024
తన డీప్‌ఫేక్ ఫొటోపై స్పందించిన మృణాల్
సినీ ఇండస్ట్రీని డీప్‌ఫేక్ వెంటాడుతూనే ఉంది. తాజాగా నటి మృణాల్ ఠాకూర్‌తో దీపావళి టపాసులు కాల్చినట్లు ఓ వ్యక్తి ఫొటో ఎడిట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇది వైరలవడంతో దీనిపై మృణాల్ స్పందించారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘మీరెందుకు ఇలా తప్పుగా ఫొటోలు ఎడిట్ చేస్తున్నారు? ఈ పని బాగుంది అనుకుంటున్నారా? అస్సలు బాలేదు’ అని కామెంట్ చేశారు. గతంలోనూ అసభ్యకర వీడియోకు రష్మికతో డీప్‌ఫేక్ చేశారు.
News November 2, 2024
నేను బతికే ఉన్నా.. మార్చురీకి తీసుకెళ్తుండగా లేచిన యువకుడు
UPలోని మీరట్ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన షగుణ్ శర్మ అనే యువకుడిని అక్కడికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం చేసేందుకు మార్చురీకి తీసుకెళ్తుండగా అతనిలో కదలిక వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ చెప్పడంతో అందరూ కంగుతిన్నారు. వెంటనే ICUకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు.