News November 23, 2024
KL రాహుల్ హాఫ్ సెంచరీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో భారత బ్యాటర్ KL రాహుల్ హాఫ్ సెంచరీ బాదారు. 124 బంతులాడిన రాహుల్ 4 ఫోర్ల సాయంతో 50 రన్స్ కొట్టారు. అటు జైస్వాల్ (71) సైతం నిలకడగా ఆడుతున్నారు. కాగా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఘోరంగా విఫలమైన భారత బ్యాటర్లు తిరిగి లయ అందుకున్నట్లు కనిపిస్తోంది.
Similar News
News November 28, 2025
SRCL: మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మొదటి విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను ఇన్ఛార్జ్ కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు పాల్గొన్నారు.
News November 28, 2025
DEC 13న HYDకు మెస్సీ: CM రేవంత్

TG: తన G.O.A.T. టూర్ లిస్టులో హైదరాబాద్ కూడా యాడ్ అయ్యిందని ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. ‘డిసెంబర్ 13న హైదరాబాద్కి మెస్సీని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాను. మా గడ్డ మీద మీలాంటి ఫుట్బాల్ స్టార్ని చూడాలని కలలుగన్న ప్రతి అభిమానికి ఇది ఎగ్జైటింగ్ మూమెంట్. మీకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సగర్వంగా సిద్ధమైంది’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2025
భారత్ తగ్గేదే లే.. GDP వృద్ధి రేటు 8.2%

భారత జీడీపీ అంచనాలను మించి రాణించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో వృద్ధి రేటు 8.2%గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 5.6%గా ఉంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈ నంబర్లను రిలీజ్ చేసింది. అమెరికా టారిఫ్స్ విధించినా భారత ఆర్థిక రంగం మెరుగ్గా రాణించడం విశేషం.


