News November 23, 2024

KL రాహుల్ హాఫ్ సెంచరీ

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్ KL రాహుల్ హాఫ్ సెంచరీ బాదారు. 124 బంతులాడిన రాహుల్ 4 ఫోర్ల సాయంతో 50 రన్స్ కొట్టారు. అటు జైస్వాల్ (71) సైతం నిలకడగా ఆడుతున్నారు. కాగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన భారత బ్యాటర్లు తిరిగి లయ అందుకున్నట్లు కనిపిస్తోంది.

Similar News

News December 9, 2024

ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా IAS సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ రేపు రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎల్లుండి నుంచి మూడేళ్లపాటు మల్హోత్రా గవర్నర్‌గా కొనసాగుతారు.

News December 9, 2024

మేం ఏమన్నా లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?: మ‌మ‌త

image

భారత్‌లోని పలు రాష్ట్రాలను ఆక్ర‌మించుకుంటామ‌ని కొంద‌రు బంగ్లా రాజ‌కీయ నేతలు, మాజీ సైనికోద్యోగులు చేసిన వ్యాఖ్య‌ల‌కు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కౌంట‌ర్ ఇచ్చారు. ‘మీరు బెంగాల్‌, ఒడిశా, బిహార్‌ల‌ను ఆక్ర‌మించుకుంటుంటే మేము మాత్రం లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?’ అంటూ కౌంట‌ర్ అటాక్ చేశారు. బంగ్లాలో హిందువులు హింస‌కు గుర‌వుతుండ‌డంపై బెంగాల్ హిందూ, ముస్లింలు ఆందోళ‌న‌గా ఉన్నార‌ని ఆమె పేర్కొన్నారు.

News December 9, 2024

ధ‌న్‌ఖఢ్‌పై విప‌క్షాల అవిశ్వాస తీర్మానం!

image

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ జగదీప్ ధ‌న్‌ఖఢ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని విప‌క్ష ఇండియా కూట‌మి పార్టీలు నిర్ణ‌యించాయి. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న స‌భ‌ను న‌డుపుతున్న తీరుపై విప‌క్షాలు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ ఛైర్మన్ తమతో వాగ్వాదానికి దిగుతున్నారని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన తీర్మానంపై TMC, AAP, SP సంత‌కాలు చేశాయి. త్వరలో సభలో ప్రవేశపెట్టనున్నాయి.