News February 26, 2025

KMR: పది పరీక్షలు..ఎంత మంది రాయనున్నారంటే..?

image

పది పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసే పనిలో ఉంది. KMR జిల్లాలో పది వార్షిక పరీక్షలు 12,579 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందు కోసం 64 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు..ఐదుగురు రూట్, 22 మంది కస్టోడియన్స్, 22 జాయింట్ కస్టోడియన్స్, 11 మంది సీ సెంటర్ కస్టోడియన్స్, ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్, 12 సిట్టింగ్ స్క్వార్డ్, 698 మంది ఇన్విజిలేటర్లను నియమించింది.

Similar News

News February 26, 2025

సిరిసిల్ల: ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు ఈ నెల 27న ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి అయిందని, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు 56.. టీచర్ అభ్యర్థులు15 పోటీలో ఉండగా.. 22,397 మంది గ్రాడ్యుయేట్లు 950 మంది టీచర్ ఓటర్లు ఉన్నారన్నారు.

News February 26, 2025

నా సినిమాలో నటించినందుకు ఛాన్సులివ్వట్లేదు: సందీప్

image

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థపై ఫైరయ్యారు. ‘కబీర్ సింగ్‌ సినిమాలో నటించినందుకు ఒక నటుడిని ఓ నిర్మాణ సంస్థ తిరస్కరించిందని తెలిసి ఆశ్చర్యపోయా. అతను ఒక చిన్న పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆడిషన్ ఇచ్చినందుకు నా సినిమాలో పనిచేసినందుకు తీసుకోవట్లేదని చెప్పడం ఏంటి? వారికి ధైర్యం ఉంటే ఇదే మాట రణ్‌బీర్ కపూర్, త్రిప్తి దిమ్రీ, రష్మికతో చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.

News February 26, 2025

ఇలాంటి పాస్‌వర్డ్ ఉంటే హ్యాక్ చేయలేరు!

image

హ్యాకర్ల నుంచి డేటాను కాపాడుకునేందుకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. 11 నంబర్స్ లేదా 8 స్మాల్ క్యారెక్టర్స్‌తో ఉన్న పాస్‌వర్డ్‌ను వెంటనే హ్యాక్ చేయొచ్చు. అదే 17 నంబర్స్, 12 స్మాల్ క్యారెక్టర్స్ లేదా 9 నంబర్స్‌తో పాటు స్మాల్ & క్యాపిటల్‌తో సహా చిహ్నాలుంటే రెండ్రోజులు పట్టొచ్చు. 18 సంఖ్యల్లో స్మాల్, క్యాపిటల్ లెటర్స్‌తో పాటు సింబల్స్ ఉంటే దానిని హ్యాక్ చేసేందుకు 4 కోట్ల సంవత్సరాలు పడుతుంది.

error: Content is protected !!