News April 4, 2025
KMR: 3 నెలల్లో 136 రోడ్డు ప్రమాదాలు

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కేవలం 3 నెలల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 136 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ప్రాణాంతకమైన ప్రమాదాల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు. ప్రాణాంతకం కానీ ప్రమాదాల్లో..105 మంది గాయపడ్డారు. మరో 7 మందికి ఎలాంటి గాయాలు కాలేదు. జిల్లా పోలీసు శాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో పై వివరాలు వెల్లడయ్యాయి.
Similar News
News April 8, 2025
సిరిసిల్ల: ఇసుక రీచ్‌లు ప్రారంభించాలి: కలెక్టర్

రేపటి నుంచి పదిర, కొండాపూర్ ఇసుక రీచులను ప్రారంభించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఇసుక రీచ్‌లపై ఏర్పాటుపై అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నూతనంగా నిర్మించే ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇల్లు, పెండింగ్ డబల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణానికి ఎక్కడ కూడా ఇసుక కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News April 8, 2025
ధర్మపురి: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరిలో దూకి హషాం అహ్మద్ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అహ్మద్ గత కొంతకాలం నుంచి ఫైనాన్స్ విషయంపై బాధపడుతున్నాడన్నారు. ఉదయం రాయపట్నం గోదావరిలో మృతదేహం కనిపించగా తన తండ్రి మహమ్మద్ అలీ అహ్మద్ ఆచూకీ తెలిపామని ఆయన వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని JGTL ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News April 8, 2025
3600 దాటిన మయన్మార్ మృతుల సంఖ్య

మయన్మార్ భూకంప విలయంలో మృతుల సంఖ్య 3600 దాటింది. భవనాల శిథిలాల్ని తొలగించే పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతానికి 5017మంది గాయాలతో ఉండగా 160మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు.