News April 8, 2025
3600 దాటిన మయన్మార్ మృతుల సంఖ్య

మయన్మార్ భూకంప విలయంలో మృతుల సంఖ్య 3600 దాటింది. భవనాల శిథిలాల్ని తొలగించే పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతానికి 5017మంది గాయాలతో ఉండగా 160మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా లక్ష్మీ నరసింహ యాదవ్

కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ యాదవ్‌ను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ స్థానంలో డీసీసీగా లక్ష్మీ నరసింహ యాదవ్‌ను నియమించడం పట్ల రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News July 6, 2025
ప్రభాస్‌తో రణ్‌వీర్ బాక్సాఫీస్ క్లాష్?

ప్రభాస్‌తో బాక్సాఫీస్ క్లాష్‌కి బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ రెడీ అవుతున్నట్లు బీ టౌన్‌లో వార్తలొస్తున్నాయి. ఇవాళ రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా ‘దురంధర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజవుతోంది. ఈ మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ప్రభాస్‌తో పోటీకి దిగుతారా? అనేది వేచిచూడాలి.
News July 6, 2025
‘అమెరికా పార్టీ’ స్థాపిస్తున్న ఎలాన్ మస్క్

‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’ పాసైతే మూడో పొలిటికల్ పార్టీ పెడతానని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో పార్టీపై ట్విట్టర్‌లో రెండోసారి పోల్ పెట్టగా.. 12.48 లక్షల ఓట్లొచ్చాయి. 65.4% మంది మూడో పార్టీకి ఓటేశారు. ఈ నేపథ్యంలోనే “రెండు పార్టీలు ఒక్కటే అన్న అభిప్రాయంతో మీరు కొత్త పార్టీ కోరుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు ఇవాళ ‘అమెరికా పార్టీ’ రూపుదిద్దుకుంది’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.