News February 1, 2025
KMR: రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు
కామారెడ్డి జిల్లాలో దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు రుణాలు మంజూరయ్యాయని, వీటి కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల తెలిపారు. బ్యాంకుతో సంబంధం లేకుండా 100 శాతం రాయితీతో రూ.50 వేల చొప్పున రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే గడువు వచ్చే నెల 12 వ తేదీ వరకు పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.
Similar News
News February 1, 2025
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్
అనకాపల్లి జిల్లాలో వచ్చేనెల ఐదు నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఇంటర్ అధికారులకు సూచించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేయాలన్నారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
News February 1, 2025
నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు
AP: నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. దీంతో కొత్త ఛార్జీలు తప్పించుకునేందుకు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 14250 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రోజుకు 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో దాదాపు 170 వరకు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కార్‌కు ఏకంగా రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది.
News February 1, 2025
నేడే కేంద్ర బడ్జెట్
ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌లో రైతులు, పేదలు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి బడ్జెట్‌లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది.