News February 1, 2025
నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు

AP: నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. దీంతో కొత్త ఛార్జీలు తప్పించుకునేందుకు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 14250 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రోజుకు 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో దాదాపు 170 వరకు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కార్‌కు ఏకంగా రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది.
Similar News
News February 16, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మనదే హవా

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు టీమ్ ఇండియాపైనే ఉంది. మన జట్టు ఇప్పటివరకు 18 విజయాలు తన ఖాతాలో జమ చేసుకుంది. ట్రోఫీ చరిత్రలోనే భారత్ నిలకడైన జట్టుగా కొనసాగుతోంది. ఆ తర్వాత శ్రీలంక (14), ఇంగ్లండ్ (14), వెస్టిండీస్ (13), ఆస్ట్రేలియా (12), న్యూజిలాండ్ (12), సౌతాఫ్రికా (12), పాకిస్థాన్ (12) ఉన్నాయి.
News February 16, 2025
ఏప్రిల్‌లో మత్స్యకారులకు రూ.20,000: మంత్రి

AP: ఏటా JANలో జాబ్ క్యాలెండర్, మెగా DSC అంటూ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. MLC ఎన్నికలు ముగియగానే తమ ప్రభుత్వం 16,247 పోస్టులతో DSC విడుదల చేస్తుందని పునరుద్ఘాటించారు. జూన్‌కు ముందే నియామకాలు పూర్తి చేస్తామని, ‘తల్లికి వందనం’ అందిస్తామని చెప్పారు. సముద్రంలో చేపల వేట నిషేధిత రోజులకు గాను మత్స్యకారులకు APRలో ₹20K, MAYలో ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తామన్నారు.
News February 16, 2025
మస్తాన్ సాయి కేసు.. గవర్నర్‌కు లావణ్య లాయర్ లేఖ

AP: <<15471142>>మస్తాన్‌సాయి<<>> కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య తరఫు లాయర్ లేఖ రాశారు. అతని నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అలాగే సీఎస్, గుంటూరు కలెక్టర్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి కూడా లేఖలు రాశారు.