News January 24, 2025

సైఫ్‌పై కత్తిదాడి: నిందితుడిని కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు

image

యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై కత్తిదాడి కేసులో నిందితుడు షరీఫుల్ ఇస్లామ్‌ను పోలీసులు బాంద్రా కోర్టుకు తీసుకెళ్లారు. నేటితో ముగుస్తున్న అతడి కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాల్సిందిగా వారు మెజిస్ట్రేట్‌ను కోరే అవకాశముంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో అంతుచిక్కని ప్రశ్నలు, అనుమానాలు ఎన్నో ఉన్నాయి. కోర్టు విచారణపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 14, 2025

విశ్వక్‌సేన్ ‘లైలా’ రివ్యూ

image

బ్యూటీపార్లర్ నడుపుకునే హీరో ఓ కేసులో చిక్కుకోవడం, బయటపడేందుకు ఏం చేశాడనేదే ‘లైలా’ స్టోరీ. విశ్వక్‌సేన్ లేడీ గెటప్, అక్కడక్కడా కామెడీ సీన్లు కొంత వరకు ఫర్వాలేదు. అసభ్యకర సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ రామ్ సక్సెస్ కాలేకపోయారు. సెంటిమెంట్ చాలా ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. మ్యూజిక్, స్టోరీ, సీన్లు ఎక్కడా మెప్పించలేకపోయాయి.
RATING: 1.75/5

News February 14, 2025

నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం

image

ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాహుల్ తన SM ఖాతాలో షేర్ చేశారు. ‘నాన్న లేని లోటు పూడ్చలేనిది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటా. థాంక్యూ నాన్నా’ అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా రాహుల్ పలు తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాదను ఆయన పెళ్లాడారు.

News February 14, 2025

RCB: కొత్త కెప్టెన్.. కొత్త ఆశలు.. కొత్త కలలు..

image

ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్ నియమితులయ్యారు. కొత్త కెప్టెన్ రాకతో ఈసారైనా ఆర్సీబీ కప్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏళ్లుగా కలగా మిగిలిన ట్రోఫీని పాటిదార్ సారథ్యంలో దక్కించుకోవాలని ఎదురు చూస్తున్నారు. కాగా RCBకి ఇప్పటివరకు ఏడుగురు కెప్టెన్లుగా (ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరీ, కోహ్లీ, వాట్సన్, డుప్లెసిస్) చేశారు. వారిలో ఏ ఒక్కరు ఆ జట్టుకు కప్‌ను అందించలేకపోయారు.

error: Content is protected !!