News November 20, 2024
రైలు ప్రయాణంలో ఇవి తెలుసుకోండి!

టికెట్ లేకుండా రాత్రిపూట రైలెక్కిన మహిళను దింపేసే అధికారం TTEకి లేదు. 1989 రైల్వే చట్టంలో ఒంటరిగా, పిల్లలతో ప్రయాణించే మహిళలకు రక్షణ కల్పించింది. రైళ్లలో ఉచితంగా 70 కేజీల వరకే కంపార్ట్‌మెంట్‌లోకి అనుమతిస్తారు. ఒకవేళ ట్రైన్ మిస్ అయినా తదుపరి రెండు స్టేషన్ల వరకు మీకు కేటాయించిన సీటు అలాగే ఉంటుంది. రిజర్వేషన్ బోగీలోని మిడిల్ బెర్త్ ప్యాసింజర్ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే నిద్రపోవాలి.
Similar News
News March 17, 2026
విశాఖ: అవినీతి ఆరోపణలు.. నలుగురు పోలీసుల బదిలీ

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తనదైన శైలిలో కొరడా ఝలిపిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లు గోపికృష్ణ, అగస్టీన్, శివకృష్ణ, సుధాకర్‌లను నగరంలోని పలు స్టేషన్‌లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాలుగు రోజులు ముందే డీవోలు సిద్ధమైనా.. సంబంధిత స్టేషన్‌కు ఆలస్యంగా అందాయి.
News March 17, 2026
APPLY: ప్రతినెలా రూ.3,000 పెన్షన్

చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించేందుకు కేంద్రం ‘PM-Kisan Maandhan Yojana’ను అమలు చేస్తోంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. 18-40ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 చొప్పున పొదుపు చేయాలి. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. రైతు మరణిస్తే భాగస్వామికి 50% పెన్షన్ అందిస్తారు. రైతులు ఆధార్, బ్యాంక్ వివరాలతో ‘మీసేవ’, CSC కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చు.
News March 17, 2026
ఓరల్ సెక్స్‌తో పెరుగుతున్న గొంతు క్యాన్సర్

ఇండియాలో గొంతు క్యాన్సర్‌కు పొగ తాగడం, పొగాకు నమలడం ప్రధాన కారణాలు. ఇప్పుడు US, UKలో ఓరల్ సెక్స్ ద్వారా అధిక సంఖ్యలో HPV(హ్యూమన్ పాపిలోమా వైరస్) కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో HPV-16, HPV-18 రకాలు గొంతు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయంటున్నారు. ఎక్కువ మందితో లైంగిక సంబంధం, HPV వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఈ క్యాన్సర్లు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.


