News September 17, 2024

రేవంత్ ధర్మం తెలిసినవాడు: రాజాసింగ్

image

TG: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు బాగున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందించారు. ‘పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పనితీరు బాగుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడం సంతోషకరం. రేవంత్ ధర్మం తెలిసినవాడు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News October 9, 2024

అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: CM

image

AP: పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలో అగ్రదేశంగా నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు.

News October 9, 2024

జో రూట్ సరికొత్త మైలురాయి

image

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సరికొత్త మైలురాయి అందుకున్నారు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్ సెంచరీ బాదారు. ఇప్పటివరకు ఆయన 35 శతకాలు సాధించారు. ఈ క్రమంలో లారా, గవాస్కర్, యూనిస్ ఖాన్, జయవర్ధనే (34)లను ఆయన అధిగమించారు. ఓవరాల్‌గా సచిన్ (51), కల్లిస్ (45), పాంటింగ్ (41), సంగక్కర (38), రాహుల్ ద్రావిడ్ (35) టాప్‌లో ఉన్నారు.

News October 9, 2024

నిరుద్యోగులతో సర్కార్ చెలగాటం: షర్మిల

image

AP: నాలుగు నెలలుగాAPPSCకి ఛైర్మన్‌ను నియమించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని PCC చీఫ్ YS షర్మిల మండిపడ్డారు. ఏపీపీఎస్సీపై నిర్లక్ష్యం వహిస్తూ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ‘శ్వేతపత్రాలపై పెట్టిన శ్రద్ధ, ఏపీపీఎస్సీపై కూడా పెట్టాలి. తక్షణమే దానికి ఛైర్మన్‌ను నియమించాలి. వాయిదా వేసిన పరీక్షలతో పాటు ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు కూడా షెడ్యూల్ ప్రకటించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.