News October 8, 2025

KNRలో 35 KMల హైస్పీడ్ రోడ్డు

image

ఎన్‌హెచ్ 44ను లింక్ చేస్తూ హై-స్పీడ్ కారిడార్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం DPRను సిద్ధం చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో 35 కిలోమీటర్ల మేర 6 లేన్ రోడ్డు మార్గం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన పలు అలైన్మెంట్స్‌పై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ రోడ్డు పూర్తయితే దేశంలోని ముఖ్య నగరాలను తక్కువ సమయంలో చేరుకోవచ్చు. రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత సులభతరం కానుంది.

Similar News

News October 8, 2025

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు

image

TG: బీసీ రిజర్వేషన్ల పెంపు GOపై విచారణ జరుపుతున్న హైకోర్టు.. బిల్లు పాస్ అయిందా అని ప్రశ్నించింది. అసెంబ్లీలో పాస్ అయిందని, గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దు అవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదించారు. వన్‌మెన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు.

News October 8, 2025

ఏయూ స్నాతకోత్సవం వాయిదా

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వాయిదా పడిందని రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ప్రకటన జారీ చేశారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం 91, 92 సంయుక్త స్నాతకోత్సవం జరగాల్సి ఉంది. ఈ స్నాతకోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని రిజిస్ట్రార్ తెలిపారు.

News October 8, 2025

రూమర్స్‌పై స్పందించిన రష్మిక

image

కన్నడ ఇండస్ట్రీ తనను బ్యాన్ చేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ రష్మిక ఖండించారు. తనను ఏ ఇండస్ట్రీ నిషేధించలేదన్నారు. ‘‘తెరవెనుక జరిగేది ప్రపంచానికి తెలియదు. ‘కాంతార’ టీమ్‌ను విష్ చేశా. నేను ప్రతిదీ ఆన్‌లైన్‌లో పెట్టే వ్యక్తిని కాదు. వ్యక్తిగత జీవితం గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను. నా నటన గురించి ఏం మాట్లాడతారనేది ముఖ్యం’’ అని ‘థామా’ ప్రమోషన్లలో చెప్పారు.