News March 30, 2026

KNR: ఎల్ఎండీలో తగ్గిన నీటి మట్టం!

image

కరీంనగర్ ఎల్ఎండీ జలాశయంలో నీటి నిల్వలు 7.292 టీఎంసీలకు పడిపోవడంతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ప్రతిరోజూ 55 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేసిన నగరపాలక సంస్థ, ఇకపై రోజు విడిచి రోజు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని,వృథా చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. మిడ్ మానేరు నుంచి నీటి విడుదల లేకుంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.

Similar News

News April 20, 2026

కరీంనగర్: రెండో విడత రైతు భరోసా రూ.53.5 కోట్లు

image

యాసంగి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కరీంనగర్ జిల్లాలో 2,14,313 మంది రైతులకు రూ.213.45 కోట్లు జమ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రెండు విడతల్లో 1,94,227 మందికి రూ.143.66 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. 2వ విడతలో రూ.53.50 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నిధులను భూపాలపల్లి(D) కాటారం(M) నస్తురపల్లి బహిరంగ సభలో CM రేవంత్ నేడు విడుదల చేయనున్నారు.

News April 19, 2026

కరీంనగర్: ప్రశాంతంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

image

కరీంనగర్ జిల్లాలోని 11 తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,444 మంది దరఖాస్తు చేసుకోగా, 1,263 మంది పరీక్షకు హాజరయ్యారు. 181 మంది గైర్హాజరయ్యారు. కొత్తపల్లి మండలం ఎలగందుల పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి అశ్వని తానాజీ వాకడే తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించినట్లు ఆమె తెలిపారు.

News April 19, 2026

‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి మోక్షం ఎప్పుడు..?

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకగా చేపట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలులో జాప్యంపై అభ్యర్థులు ఆశతో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో రాయితీ రుణాల కోసం 55 వేలకు పైగా యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా యూనిట్లు మంజూరు కాకపోవడంతో నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రుణాల పంపిణీ చెయ్యాలని కోరుతున్నారు.