News March 1, 2025
KNR: MLC ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సందర్శించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బాక్స్‌లను, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈనెల 3 నుంచి జరగబోయే కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లు, సూపర్‌వైజర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News March 1, 2025
BREAKING: కాచిగూడ-నిజామాబాద్ డెమో రైలు రద్దు

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమో రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు.
News March 1, 2025
పాపం ఇంగ్లండ్: 17 మ్యాచ్‌లలో ఓటమి.. ఒక్కటే గెలుపు

ఇంగ్లండ్ మెన్స్, ఉమెన్స్ క్రికెట్ జట్లు టెస్టు, వన్డే, టీ20ల్లో ఓటముల పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది బట్లర్ సేన వరుసగా 8 సహా 10 మ్యాచ్‌లు ఓడిపోయింది. కేవలం ఒక్కదాంట్లోనే గెలిచింది. CT గ్రూప్ స్టేజీలో 3 మ్యాచుల్లోనూ ఓడిన తొలి జట్టుగానూ అపఖ్యాతి మూటగట్టుకుంది. మహిళల జట్టు కూడా వరుసగా ఏడు గేమ్స్ ఓడింది. ఈ ఏడాది ఇప్పటికీ గెలుపు ఖాతా తెరవలేదు. దీంతో ఆ దేశ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News March 1, 2025
NZB: సదరం దరఖాస్తుదారులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకుని వైకల్య నిర్ధారణ కోసం హాజరయ్యే వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ సేవలను సులభతరం చేస్తూ ఇటీవల కొత్తగా యూనిక్ డిజబిలిటీ ఐడీ పోర్టల్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యల గురించి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కలెక్టర్లు, డీఆర్డీవోలు, డీడబ్ల్యూఓలకు వీసీ ద్వారా సూచించారు.