News March 1, 2025
పాపం ఇంగ్లండ్: 17 మ్యాచ్‌లలో ఓటమి.. ఒక్కటే గెలుపు

ఇంగ్లండ్ మెన్స్, ఉమెన్స్ క్రికెట్ జట్లు టెస్టు, వన్డే, టీ20ల్లో ఓటముల పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది బట్లర్ సేన వరుసగా 8 సహా 10 మ్యాచ్‌లు ఓడిపోయింది. కేవలం ఒక్కదాంట్లోనే గెలిచింది. CT గ్రూప్ స్టేజీలో 3 మ్యాచుల్లోనూ ఓడిన తొలి జట్టుగానూ అపఖ్యాతి మూటగట్టుకుంది. మహిళల జట్టు కూడా వరుసగా ఏడు గేమ్స్ ఓడింది. ఈ ఏడాది ఇప్పటికీ గెలుపు ఖాతా తెరవలేదు. దీంతో ఆ దేశ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 27, 2025
శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బంపరాఫర్?

ఈ నెల 29న గువాహటిలో బీసీసీఐ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని టాక్. కాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
News March 27, 2025
జియో, ఎయిర్‌టెల్, Vi సిమ్‌లు వాడుతున్నారా?

టెలికాం కంపెనీలు తమ వినియోగదారుల కోసం త్వరలో ‘కాలర్ నేమ్ ప్రజెంటేషన్’ సదుపాయాన్ని తీసుకురానున్నాయి. ఇది ఆయా యూజర్లకు కాల్ చేసిన అవతలి వ్యక్తి పేరును ఫోన్ స్క్రీన్‌పై చూపిస్తుంది. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్‌ను అరికట్టేందుకు TRAI దీనిని గతంలోనే ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను అమలు చేసేందుకు Jio, Airtel, Vodafone-Idea(Vi) సిద్ధమయ్యాయి. KYC డాక్యుమెంట్ ఆధారంగా ఈ పేర్లను చూపించనున్నాయి.
News March 27, 2025
IPL బ్రాండ్ వాల్యూ రూ.లక్ష కోట్లు

ఇండియాలో అతిపెద్ద ఫ్రాంచైజీ ఈవెంట్ అయిన IPL బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది. 2009లో దాదాపు రూ.17 వేల కోట్ల బ్రాండ్ విలువ కలిగిన ఈ లీగ్ 2023లో తొలిసారి $10 బిలియన్లను తాకగా.. ఇప్పుడు $12 బిలియన్లకు చేరుకుంది. 2024లో 10 జట్ల సమష్టి బ్రాండ్ విలువ 13% పెరగడంతో ప్రస్తుతం $12 బిలియన్లకు చేరుకుందని TOI తెలిపింది. ఇందులో మీడియా రైట్సే రూ.48వేల కోట్లు కావడం గమనార్హం.