News June 4, 2024
గుడివాడలో కొడాలి నాని వెనుకంజ
విజయవాడ వెస్ట్‌లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముందంజలో ఉన్నారు. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు. సమీప అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Similar News
News November 14, 2024
చిన్న పురుగే అనుకుంటే..!
సాలెపురుగు నన్నేమి చేస్తుంది అని ఎప్పుడైనా అనుకున్నారా? భూమిపై ఉన్న ఏ జీవినీ తక్కువ అంచనా వేయకూడదని సైంటిస్టులు హెచ్చరించారు. ఎందుకంటే సాలీడు జాతంతా తలుచుకుంటే ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందిని ఒక్కఏడాదిలో తినేస్తాయని సైన్స్ ఆఫ్ నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. సాలీడులు ఏడాదికి సుమారు 400 మిలియన్ టన్నుల ఆహారాన్ని తీసుకుంటాయి. మొత్తం ప్రజల బయోమాస్ కేవలం 287 మిలియన్ టన్నులేనని అందులో రాసుకొచ్చారు.
News November 14, 2024
నన్ను కమిట్‌మెంట్ అడిగారు: హీరోయిన్
ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం తదితర సినిమాలతో హీరోయిన్ కావ్యా థాపర్ టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘కెరీర్ తొలి రోజుల్లో ఓ యాడ్ ఆడిషన్స్‌కి వెళ్లాను. అక్కడున్న ఓ వ్యక్తి 4 యాడ్స్‌లో అవకాశాలిప్పిస్తానని, కమిట్మెంట్ ఇవ్వాలని అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఇలాంటివి నాకు నచ్చవని మొహమ్మీదే చెప్పి బయటికొచ్చేశాను’ అని తెలిపారు.
News November 14, 2024
Stock Market: 7% పెరిగిన ఐషర్ మోటార్స్
Q2 ఫలితాలు 8%(YoY) అధికంగా రాబట్టడంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ పేరెంట్ సంస్థ ఐషర్ మోటార్స్ షేరు గురువారం సెషన్‌లో 7% వరకు పెరిగింది. Hero Motoco 2%, Grasim 1.24%, Kotak Bank 1.23%, Hdfc Life 1.20% లాభపడి టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. HindUnilvr 2.92%, BPCL 2.50%, Britannia 2.47%, Tata Consum 2.35%, Nestle Ind 2.11% నష్టపోయి టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మీడియా, బ్యాంకు, ఆటో, ఫైనాన్స్ రంగ షేర్లు లాభపడ్డాయి.