News April 2, 2025

కొడాలి నాని హెల్త్ UPDATE

image

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆపరేషన్ కోసం ముంబై వెళ్లారు. అక్కడి ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ వైద్యులు ఆయనకు బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని కొద్దిరోజుల్లోనే డిశ్చార్జ్ కానున్నారు.

Similar News

News April 19, 2025

‘జాట్‌’లో ఆ సీన్ తొలగింపు

image

జాట్‌లో ఓ సీన్ తమ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందంటూ క్రైస్తవులు ఆరోపించడంతో ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు మూవీ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఎవరి మనోభావాల్ని గాయపరచడం మా ఉద్దేశం కాదు. ఆ సన్నివేశం పట్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరుతున్నాం’ అని అందులో పేర్కొన్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్‌ను తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించారు.

News April 19, 2025

రక్షణ ఎగుమతులను రూ.50 వేల కోట్లకు చేరుస్తాం: రాజ్‌నాథ్

image

రక్షణ రంగంలో భారత్‌ స్వయం ప్రతిపత్తి సాధించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. MHలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మాట్లాడుతూ ‘మేం 2014లో అధికారం చేపట్టినప్పుడు రక్షణ ఎగుమతులు రూ.600 కోట్ల వరకే జరిగేవి. ప్రస్తుతం రూ.24వేల కోట్లకు చేరాయి. ఇక్కడితో సంతృప్తిపడం. 2029-30 వరకు ఎగుమతులను రూ.50 వేల కోట్లకు చేర్చాలనేదే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు.

News April 18, 2025

IPL: RCBకి బిగ్ షాక్

image

పంజాబ్‌తో మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RCB కష్టాల్లో పడింది. 6.1 ఓవర్లలో 33 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 4, కోహ్లీ 1, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ 2, కృణాల్ ఒక పరుగుకే పెవిలియన్ చేరారు. వర్షం కారణంగా పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. మ్యాచును 14 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. PBKS బౌలర్లలో అర్ష్‌దీప్ 2, బార్ట్‌లెట్, చాహల్, జాన్‌సెన్ తలో వికెట్ తీశారు.

error: Content is protected !!