News February 26, 2025
టాప్-5లోకి కోహ్లీ

ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కింగ్ కోహ్లీ టాప్-5లోకి దూసుకొచ్చారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకొని ఐదో ర్యాంకుకు చేరారు. ఇక నం.1 స్థానంలో 817 పాయింట్లతో గిల్ కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్, రోహిత్ శర్మ, క్లాసెన్ ఉన్నారు. మరోవైపు వన్డేల్లో టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
Similar News
News March 26, 2025
మధ్యాహ్నం బయటకు రాకండి.. ప్రభుత్వం సూచన

TGలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణాలు చేసే సమయాల్లో నీరు, ORS వెంట ఉంచుకోవాలని, దాహం లేకున్నా నీటిని తాగాలని సూచించింది. వీలైనంత వరకు శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలని, కళ్లజోడు, క్యాప్ పెట్టుకోవాలని తెలిపింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలంది. మ.12-3 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లొద్దని పేర్కొంది.
News March 26, 2025
IPL: ఢిల్లీకి గుడ్ న్యూస్!

భార్య అతియా శెట్టి డెలివరీ కారణంగా IPLలో తొలి మ్యాచుకు దూరమైన ఢిల్లీ ప్లేయర్ కేఎల్ రాహుల్ రెండో మ్యాచుకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం వైజాగ్‌లో SRHతో జరిగే మ్యాచులో ఆయన ఆడతారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌కు బలం చేకూరనుంది. అంతకుముందు లక్నోతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో ఢిల్లీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
News March 26, 2025
ఉపాధి హామీ కూలీలుగా షమీ సోదరి, బావ: జాతీయ మీడియాలో కథనాలు

భారత్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ సోదరి, బావ.. జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా నమోదైనట్లు నేషనల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2021 నుంచి 2024 వరకు ఆ మేరకు వేతనాలు కూడా తీసుకున్నట్లు తెలిపాయి. అయితే ఈ ఆరోపణలపై షమీ కుటుంబం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇటీవల CT ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత షమీ తల్లి, సోదరి భారత క్రికెట్ జట్టుతో మైదానంలో కనిపించిన విషయం తెలిసిందే.