News October 1, 2024
షకీబ్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు తన బ్యాటును గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా యంగ్ క్రికెటర్లకు కోహ్లీ తన బ్యాట్లను గిఫ్ట్‌గా ఇస్తుంటారు. రింకూ సింగ్, ఆకాశ్ దీప్, గుర్బాజ్ తదితరులకు బ్యాట్ ఇచ్చారు. మరోవైపు విరాట్ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆకాశ్ దీప్ నిన్న బంగ్లాపై రెండు సిక్సర్లు బాదడం విశేషం.
Similar News
News October 4, 2024
దసరాకు ప్రత్యేక రైళ్లు
దసరా సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్ నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.
News October 4, 2024
అత్యంత ధనిక యాక్టర్ ఈయనే!
ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మేల్ యాక్టర్స్ జాబితాలో నటుడు, చిత్రనిర్మాత టైలర్ పెర్రీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సంపద నికర విలువ దాదాపు $1.4 బిలియన్ (₹11,750 కోట్లు). రెండో స్థానంలో హాస్యనటుడు జెర్రీ సీన్‌ఫెల్డ్ ($1 బిలియన్) ఉన్నారు. వీరి తర్వాత డ్వేన్ జాన్సన్ ($890 మిలియన్లు), షారుఖ్ ఖాన్ ($870 మిలియన్లు), టామ్ క్రూయిజ్ ($800 మిలియన్లు) ఉన్నారు.
News October 4, 2024
ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ హతం
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణ్‌పూర్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆటోమేటిక్ గన్లు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.