News October 15, 2024

కోహ్లీ.. మరో 53 పరుగులు చేస్తే

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువయ్యారు. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులో మరో 53 పరుగులు చేస్తే 9వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకోనున్నారు. దీంతో భారత జట్టు తరఫున టెస్టుల్లో 9వేల పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలవనున్నారు. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు 115 టెస్టులు ఆడిన కోహ్లీ 8,947 పరుగులు చేశారు.

Similar News

News November 9, 2025

వారంలో టెట్ నోటిఫికేషన్?

image

TG: టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎంకు చేరింది. ఏటా రెండు సార్లు టెట్​ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ కోసం అధికారులు ఫైల్​ సిద్ధం చేశారు. ప్రభుత్వ అనుమతి వస్తే వారంలో నోటిఫికేషన్​ వచ్చే అవకాశముంది. కాగా టీచర్లూ టెట్​ పాసవడం తప్పనిసరి అయిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పించేందుకు అర్హత నిబంధనల జీవోను సవరించాల్సి ఉంది.

News November 9, 2025

మల్బరీలతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు!

image

మల్బరీ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. 3 రంగుల్లో లభించే ఈ పండ్లలో విటమిన్ బి1, బి2, బి3, బి6, సి, ఇ, ఐరన్, కాల్షియమ్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫోలేట్, సోడియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. మల్బరీల్లోని ఆంథోసైనిన్‌లు పెద్దప్రేగు, చర్మ, ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయని, డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అంటున్నారు.

News November 9, 2025

అద్వానీకీ అదే న్యాయం వర్తిస్తుంది: శశిథరూర్

image

BJP నేత అద్వానీపై కాంగ్రెస్ MP శశిథరూర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఒక్క ఘటనను కారణంగా చూపించి ఆయన చేసిన సుదీర్ఘ సేవను తగ్గించడం అన్యాయం. చైనా ఎదురుదెబ్బను చూపించి నెహ్రూ కెరీర్‌ను, ఎమర్జెన్సీ ఆధారంగా ఇందిరా గాంధీ రాజకీయ జీవితాన్ని నిర్వచించలేం. అద్వానీకీ అదే న్యాయం వర్తిస్తుంది’ అని తెలిపారు. విద్వేషపు విత్తనాలు నాటడం సేవ కాదని అద్వానీపై అడ్వకేట్ సంజయ్ హెగ్డే చేసిన ట్వీట్‌కు ఇలా బదులిచ్చారు.