News February 1, 2025
రంజీల్లో కోహ్లీ.. రోజుకు జీతం ఎంతంటే?

విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్నారు. రంజీలు ఆడితే కోహ్లీకి రోజుకు రూ.60,000 జీతం అందుకోనున్నారు. మ్యాచ్ జరిగే 4 రోజులకు కలిపి రూ.2.40 లక్షలు పారితోషికం తీసుకుంటారు. రంజీల్లో 40 మ్యాచులకు పైగా ఆడితే రోజుకు రూ.60వేలు, 21-40 మ్యాచులకు రూ.50వేలు, 20 కంటే తక్కువ ఆడితే రూ.40వేలు, ఆరంగేట్ర ఆటగాడికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఇస్తారు.
Similar News
News February 7, 2025
ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

TG: ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. అనారోగ్యం లేదా అత్యవసర కారణాల వల్ల నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కాని వారికి మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ఛాన్స్ ఇవ్వనుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం విద్యార్థులు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని సంప్రదించాలని సూచించింది. ఈనెల 22తో ఇంటర్ ప్రాక్టికల్స్ ముగియనున్నాయి.
News February 7, 2025
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. BJPకే జైకొట్టిన మరో 2 సంస్థలు

ఢిల్లీలో ఈసారి BJP తిరుగులేని విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. నిన్న రాత్రి సర్వే ఫలితాలు వెల్లడించిన టుడేస్ చాణక్య, CNX కూడా కమలం పార్టీకే జైకొట్టాయి. ఆ పార్టీ 51 సీట్లు గెలిచే అవకాశం ఉందని టుడేస్ చాణక్య అంచనా వేయగా, 49-61 స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని CNX పేర్కొంది. కాగా BJP 45-55 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని నిన్న సాయంత్రం మై యాక్సిస్ ఇండియా తెలిపింది.
News February 7, 2025
సీఎం రేవంత్‌పై WEF ప్రశంసల జల్లు

TG: CM రేవంత్ రెడ్డిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) ప్రశంసలు కురిపించింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి విషయంలో ఆయన దార్శనికత అద్భుతమని పేర్కొంటూ ఓ లేఖ రాసింది. ‘రాష్ట్ర అభివృద్ధికోసం మీ ప్రణాళికలు బాగున్నాయి. దావోస్ సదస్సులో మీరు కీలక భాగస్వామిగా వ్యవహరించారు. రైజింగ్ తెలంగాణ 2050 నినాదం ప్రత్యేకంగా నిలిచింది. 2047 కల్లా హైదరాబాద్‌ను కాలుష్యంలో నెట్ జీరో చేయాలన్న మీ సంకల్పం ప్రశంసనీయం’ అని కొనియాడింది.