News October 14, 2024
కోహ్లీ ప్రపంచస్థాయి క్రికెటర్: గంభీర్

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘2008లో కోహ్లీ అరంగేట్రం చేసినప్పటి నుంచి అతడిపై నా అభిప్రాయం మారలేదు. విరాట్ ప్రపంచ స్థాయి క్రికెటర్. శ్రీలంకపై తొలిమ్యాచ్‌లోనే ఆయనతో ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడం నాకింకా గుర్తుంది. ఎప్పుడూ పరుగుల ఆకలితో ఉండటం ఆయన్ను దిగ్గజ క్రికెటర్‌ను చేసింది. NZ, AUS టెస్టు సిరీస్‌ల్లోనూ కోహ్లీ రాణిస్తారు’ అని తెలిపారు.
Similar News
News January 11, 2026
నేషనల్ అథారిటీ కాంపాలో ఉద్యోగాలు

నేషనల్ కాంపెన్సేటరీ అపారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ(నేషనల్ అథారిటీ <
News January 11, 2026
పసుపు పాలిషింగ్ – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పసుపును పాలిషింగ్ చేయడం వల్ల దుంపలు, కొమ్ములపై ఉండే దుమ్ము, ధూళితో పాటు వేర్లు, పొలుసులు తొలగి దుంపలు చూడటానికి ఆకర్షణీయంగా కనబడతాయి. పాలిషింగ్ కోసం చేతితో తిప్పే లేదా విద్యుత్‌తో నడిచే పాలిషింగ్ డ్రమ్ములు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పాలిష్ చేసేటప్పుడు రంగు కోసం పసుపు పొడిని మాత్రమే వాడాలి. ఇతర కృత్రిమ రంగులు/రసాయనాలు కలపకూడదు. కొమ్ములను, దుంపలను సైజును బట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు పంపాలి.
News January 11, 2026
అయ్యప్ప మాల ఎక్కడ వేసుకున్నామో అక్కడే తీయాలా?

ఇలాంటి నియమం లేదు. యాత్ర ముగిశాక ఇంటికొచ్చి గురుస్వామి సమక్షంలో దీక్షా విరమణ చేయవచ్చు. శబరిమలలో మాల తీయకూడదంటారు. మాల ధరించి ఉండటమే స్వామి దర్శనానికి ప్రధాన అర్హత. ఇంటికి చేరాక ద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి, మంత్రపూర్వకంగా మాల విరమణ చేయాలి. మాలను పాలలో శుద్ధి చేసి భద్రపరచాలి. స్థలం కంటే భక్తి, క్రమశిక్షణగా ఉండే వ్రత పాలనే ముఖ్యం. పద్ధతిగా దీక్ష ముగిస్తే వ్రత ఫలం పూర్తిగా లభిస్తుంది.


