News October 26, 2024
కోహ్లీ ఔట్

న్యూజిలాండ్తో రెండో టెస్టులో గట్టెక్కేందుకు భారత్ ఆశలు పెట్టుకున్న కోహ్లీ కూడా ఔట్ అయ్యారు. 17 రన్స్ వద్ద సాంట్నర్ బౌలింగ్లో LBWగా వెనుదిరిగారు. దీంతో భారత్ 147 పరుగులకే 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. క్రీజులో సుందర్, సర్ఫరాజ్ ఉన్నారు. విజయానికి ఇంకా 212 రన్స్ కావాలి.
Similar News
News January 14, 2026
సంక్రాంతి: నల్ల నువ్వులతో ఈ పరిహారాలు పాటిస్తే?

సంక్రాంతి నాడు నల్ల నువ్వుల దానం సిరిసంపదలను ప్రసాదిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పితృదేవతలు శాంతించి, వంశాభివృద్ధి కలుగుతుందని సూచిస్తున్నారు. ‘దీనివల్ల శని దోషాలు కూడా తొలగి ప్రశాంతత లభిస్తుంది. నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల చలికాలపు అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది’ అని వివరిస్తున్నారు. మరిన్ని సంక్రాంతి విశేషాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.
News January 14, 2026
వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

AP: రహదారి ప్రమాదాల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంత వాహనాల లైఫ్ ట్యాక్స్పై 10 శాతం రహదారి భద్రతా సెస్ వసూలు చేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. ‘ఏపీ మోటార్ వాహన పన్ను చట్టం-1963’ సవరణకు మంత్రివర్గం, గవర్నర్ ఆమోదం లభించింది. ఇకపై వాహనం కొనుగోలు సమయంలో లైఫ్ ట్యాక్స్కు అదనంగా సెస్ చెల్లించాలి. ఈ నిధులను రోడ్ల మరమ్మతులు, బ్లాక్ స్పాట్స్ తొలగింపునకు వినియోగించనున్నారు.
News January 14, 2026
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వాయిదా

ఇవాళ విడుదల కావాల్సిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 నోటిఫికేషన్ను <


