News October 26, 2024
కోహ్లీ ఔట్
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో గట్టెక్కేందుకు భారత్ ఆశలు పెట్టుకున్న కోహ్లీ కూడా ఔట్ అయ్యారు. 17 రన్స్ వద్ద సాంట్నర్ బౌలింగ్‌లో LBWగా వెనుదిరిగారు. దీంతో భారత్ 147 పరుగులకే 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. క్రీజులో సుందర్, సర్ఫరాజ్ ఉన్నారు. విజయానికి ఇంకా 212 రన్స్ కావాలి.
Similar News
News November 13, 2024
మహిళలూ.. ఇలా జుట్టు వేసుకుంటున్నారా?
అమ్మాయిలు వెంట్రుకలను వెనక్కి గట్టిగా లాగి పోనీ టేల్ వేసుకోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోనీ టేల్స్ వల్ల హెడేక్ రావడంతో పాటు మెడ నరాల్లో నొప్పి పెరిగి నడుము నొప్పి రావొచ్చు. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అవుతుంది. దురద వల్ల అసౌకర్యానికి లోనవుతారు. నరాలపైన ఒత్తిడి పెరిగి మైగ్రేన్ హెడేక్‌కు దారితీయవచ్చు’ అని చెబుతున్నారు. ఫ్యాషన్ కోసం ఇలా చేయడం మానేయాలంటున్నారు. SHARE IT
News November 13, 2024
టూత్‌పేస్ట్‌పై ఈ కలర్ కోడ్స్ ఏంటి?
నిత్యం వినియోగించే టూత్ పేస్టుల్లో కలర్ కోడ్స్ ఉండటం గమనించారా? ఇవేమీ డిజైన్ కోసం వేసినవి కాదు. మొత్తం నాలుగు రంగుల స్ట్రిప్స్‌ను టూత్ పేస్ట్ కవర్‌పై చూడవచ్చు. ఇందులో బ్లూ రంగు న్యాచురల్ & మెడిసిన్స్‌తో కూడినదని సూచిస్తుంది. రెడ్ కలర్ న్యాచురల్ & కెమికల్స్ యాడ్ చేసినదని, గ్రీన్ కలర్ ఉంటే న్యాచురల్‌గా తయారుచేసిందన్నమాట. ఇక స్ట్రిప్‌పై బ్లాక్ కలర్ ఉంటే అది పూర్తిగా కెమికల్స్‌తో చేసిందని అర్థం.
News November 13, 2024
కులగణన గేమ్ చేంజర్ కాబోతోంది: CM రేవంత్
TG: రాష్ట్రంలో చేపట్టిన కులగణన గేమ్ చేంజర్ కాబోతోందని CM రేవంత్ అన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు చేరాలంటే ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అసలు గణాంకాలు లేకుంటే అసలైన అర్హులకు న్యాయం చేయలేమని అన్నారు. అందుకే కులగణన చేపట్టామని, ఇదొక మైలురాయిగా మిగులుతుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఇంటర్వ్యూలో ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.