News March 6, 2025
సింగిల్స్‌లో ‘కింగ్’.. కోహ్లీ

క్రికెట్‌లో సిక్సులు, ఫోర్ల కంటే ఒక ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సింగిల్స్, డబుల్స్ చాలా కీలకం. ఈ విషయంలో కింగ్ కోహ్లీది అందెవేసిన చేయి. విరాట్ 301 వన్డేల్లో 14,180 రన్స్ చేస్తే అందులో సింగిల్స్ ద్వారానే 5,870 పరుగులు వచ్చాయి. 2000 JAN నుంచి ODI క్రికెట్‌లో ఓ బ్యాటర్‌కు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో సంగక్కర(5,503), జయవర్దనే(4,789), ధోనీ(4,470), పాంటింగ్(3,916), రోహిత్(3,759) ఉన్నారు.
Similar News
News March 17, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వంశీని కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అంగీకరించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 19కు వాయిదా వేసింది.
News March 17, 2025
కొత్త ఏడాది రాశిఫలాలు..

ఈ నెల 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త ఏడాది పంచాంగంలో రాశుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఇలా ఉన్నాయి. కన్య, మిథునం రాశుల వారికి ఆదాయం ఎక్కువ. వీరికి 14 ఆదాయం, వ్యయం 2గా ఉంది. మేషం, వృశ్చికం రాశులవారికి 2మాత్రమే ఆదాయం ఉండగా, వ్యయం మాత్రం 14గా ఉంది. మేష రాశి వారికి అత్యధికంగా అవమానం 7గా ఉంది. కర్కాటకం, కుంభం రాశులవారికి రాజపూజ్యం 7గా ఉంది. మీరూ చెక్ చేసుకోండి.
News March 17, 2025
పోసాని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

AP: పోసాని కృష్ణమురళికి ఒక రోజు CID కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ప్రెస్‌మీట్‌లో ప్రముఖులను అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై CID కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్ గుంటూరు కోర్టులో రేపు విచారణకు రానుంది.