News May 22, 2024
ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ప్లేయర్‌గా కోహ్లీ

ఐపీఎల్ చరిత్రలో 8000 పరుగులు పూర్తి చేసిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచారు. RRతో జరుగుతున్న మ్యాచులో ఆయన ఈ ఘనత సాధించారు. IPL కెరీర్‌లో కోహ్లీ 8 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు నమోదు చేశారు. పరుగుల పరంగా కోహ్లీ దరిదాపుల్లో ఏ ప్లేయర్ లేకపోవడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో శిఖర్ ధవన్(6,769) ఉన్నారు. మరోవైపు ఈ సీజన్‌లో లీడింగ్ స్కోరర్‌గా కోహ్లీ ఉన్నారు.
Similar News
News April 16, 2026
BREAKING: లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు.. వాడీవేడీ చర్చ

లోక్‌సభలో మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిని చర్చకు అనుమతించడంపై కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాడీవేడీగా చర్చ జరుగుతోంది. మొత్తం మూడు బిల్లులపై లోక్‌సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటలపాటు చర్చ, ఆపై ఓటింగ్ జరగనుంది.
News April 16, 2026
IPL: ఇదేం రూల్ సార్..

నిన్న LSGతో మ్యాచులో RCB బౌలర్ హేజిల్‌వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడంపై కొందరు IPL ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. అతడు తీసింది ఒకే ఒక్క వికెట్. కానీ మరో బౌలర్ రసిఖ్ దార్ 4 వికెట్లు పడగొట్టారు. అయితే హేజిల్‌వుడ్ కంటే అతడు 4 పరుగులు ఎక్కువ ఇచ్చారు. అతడి ఎకానమీ 6 కాగా హేజిల్‌వుడ్‌ది 5. దీంతో POTMకు ఇదే కొలమానమా? వికెట్లు తీయాల్సిన అవసరం లేదా? అని కొందరు BCCIని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?
News April 16, 2026
బియ్యపు పిండి దీపంతో కలిగే లాభమేంటి?

సర్వసాధారణంగా, అత్యంత శక్తివంతంగా వాడేది బియ్యపు పిండి దీపం. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం. లక్ష్మీదేవి ముందు ప్రతిరోజు బియ్యపు పిండి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి. జాతకంలోని రాహు-కేతు దోషాల నివారణకు కూడా ఈ దీపం రామబాణంలా పనిచేస్తుంది. కుటుంబంలో అభివృద్ధి, సంతాన సౌఖ్యం, నిరంతర సంపద కోరుకునే వారు ఈ దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం.


