News March 20, 2024
నా పేరు కోహ్లీకి తెలుసు: శ్రేయాంక

యూత్ క్రష్ శ్రేయాంక పాటిల్ తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీని కలిసి సంతోషం వ్యక్తం చేశారు. ‘అతడి వల్లే క్రికెట్ చూడటం ప్రారంభించా. విరాట్‌లా ఉండాలని కలలు కంటూ పెరిగా. గత రాత్రి అతడిని కలిసిన క్షణం నా జీవితంతో మరిచిపోలేనిది. విరాట్.. హాయ్ శ్రేయాంక అని పలకరించారు. బాగా బౌలింగ్ చేశానని ప్రశంసించారు. నిజానికి నా పేరు కోహ్లీకి తెలుసు’ అంటూ శ్రేయాంక ట్వీట్ చేశారు.
Similar News
News February 11, 2025
ఆ చట్టం రద్దుతో అదానీకి ప్రయోజనం!

డొనాల్డ్ ట్రంప్ <<15426089>>FCPA<<>> చట్టాన్ని సస్పెండ్ చేయడంతో భారత వ్యాపారి గౌతమ్ అదానీకి ఊరట లభించే అవకాశముంది. ఇప్పటికిప్పుడు అభియోగాలను రద్దుచేసే అవకాశమైతే లేదు గానీ విచారణను నిలిపివేస్తారు. అటార్నీ జనరల్ పామ్ బొండి సవరణలతో కూడిన చట్టాన్ని తీసుకురాగానే దాని ఆధారంగా విచారణ ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం కోసం నజరానాలు ఇవ్వడం నేరం కాదని ట్రంప్ నొక్కి చెబుతుండటంతో చట్టం తీరుతెన్నులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
News February 11, 2025
రూ.70 కోట్లు దాటిన ‘తండేల్’ కలెక్షన్లు

నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘తండేల్’ మూవీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. FEB 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై నాలుగు రోజుల్లో రూ.73.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ మేరకు ‘బ్లాక్‌బస్టర్ లవ్ సునామీ’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని K.మత్స్యలేశం గ్రామానికి చెందిన రామారావు, జాలర్ల వాస్తవిక కథ ఆధారంగా తెరకెక్కించిన ‘తండేల్’కు పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
News February 11, 2025
DANGER: ఈ ఫుడ్ కలర్ వాడితే క్యాన్సర్ రావొచ్చు!

అమెరికాలో బ్యాన్ చేసిన ‘RED DYE #3’ ఫుడ్ కలర్‌ను చీప్‌గా వస్తోందని ఇండియాలోని చాలా కంపెనీలు వాడుతున్నాయి. ఈ రంగును చాక్లెట్స్, డ్రింక్స్, కేకుల్లో వాడుతుంటారు. ఇది హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘RED DYE #3’ ఎలుకపై టెస్ట్ చేయగా అది క్యాన్సర్‌కు దారితీసింది. పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, ఎలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రొడక్ట్ లేబుల్ చెక్ చేసి దానిలో ‘RED3’ అని ఉంటే వాటిని కొనకండి.