News May 12, 2024

అరుదైన ఘనతకు చేరువలో కోహ్లీ

image

ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్‌లో 36 సెంచరీలు, లిస్ట్-ఏలో 54 సెంచరీలు, టీ20ల్లో 9 సెంచరీలు చేసి మొత్తం 99 శతకాల వద్ద ఉన్నారు. గత మ్యాచ్‌లో ఆయన 8 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News December 1, 2025

రాజ్ నిడిమోరు గురించి తెలుసా?

image

రాజ్ నిడిమోరు తిరుపతిలో (1979) జన్మించారు. SVUలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశారు. USలో ఉద్యోగం చేశారు. సినిమా కల నెరవేర్చుకునేందుకు ఫిల్మ్ మేకింగ్‌లోకి అడుగుపెట్టారు. 2002లో షాదీ.కామ్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయ్యారు. ఆ సిరీస్ సీజన్-2లో సమంత నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు సమాచారం. తాజాగా వారు ఒక్కటయ్యారు.

News December 1, 2025

వయస్సును వెనక్కి తిప్పే బొటాక్స్

image

వయసు మీద పడుతున్నా యవ్వనంగా కనిపించేలా చేయడానికి అనేక రకాల చికిత్సలున్నాయి. వాటిల్లో ఒకటే బొటాక్స్. ముఖంపై ముడతలను పోగొట్టడానికి ఇచ్చే ఒక న్యూరో టాక్సిన్‌ ప్రొటీన్‌ ఇది. దీనిని బ్యాక్టీరియం క్లోస్ట్రిడియం బొటులినమ్‌ అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. దీనిని మన కండరాల్లోకి చొప్పిస్తే చర్మంపై గీతలు, ముడతలు తగ్గి మృదువుగా కనిపిస్తుంది. సంవత్సరానికి 2-3 మూడు ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది.

News December 1, 2025

డ్రామాపైనే మోదీ దృష్టి: ఖర్గే

image

ముఖ్యమైన అంశాలపై చర్చించడం కంటే డ్రామాపై ప్రధాని మోదీ ఎక్కువ దృష్టి పెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. గత 11 ఏళ్లుగా ప్రభుత్వం పార్లమెంటరీ మర్యాదను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కనీసం చర్చించకుండా 15 నిమిషాల్లోనే కొన్ని బిల్లులు పాస్ చేసిందని విమర్శించారు. సాగు చట్టాలు, జీఎస్టీ సవరణలు, సీఏఏపై తగిన చర్చ లేకుండా పార్లమెంటును బుల్డోజ్ చేసిందన్నారు.