News May 12, 2024
అరుదైన ఘనతకు చేరువలో కోహ్లీ

ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్‌లో 36 సెంచరీలు, లిస్ట్-ఏలో 54 సెంచరీలు, టీ20ల్లో 9 సెంచరీలు చేసి మొత్తం 99 శతకాల వద్ద ఉన్నారు. గత మ్యాచ్‌లో ఆయన 8 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News February 9, 2025
బీజేపీ బలోపేతానికి కారణమే మీరు.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి కౌంటర్

TG: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో రాహుల్ గాంధీకి <<15396872>>అభినందనలు<<>> తెలిపిన కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం సొంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం ఆయనదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడానికి బీఆర్ఎస్సే కారణమని కోమటిరెడ్డి ఆరోపించారు.
News February 9, 2025
16 నుంచి పెద్దగట్టు జాతర

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల(మ) దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి 20 వరకు ఇది జరగనుంది. మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి లక్షల మంది వస్తారు. అటు జాతరకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
News February 9, 2025
భార్యను నరికిన ఘటనలో మరో సంచలనం!

TG: హైదరాబాద్ మీర్పేట్లో భార్యను ముక్కలుగా నరికిన <<15262482>>ఘటనలో<<>> మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటమాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి మరో ముగ్గురు కుటుంబీకులు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని భావిస్తున్నారు. ఆ ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు శనివారం నుంచి గురుమూర్తిని కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తున్నారు.