News April 11, 2024

కోహ్లీ-రోహిత్ పోరు.. ఆధిపత్యం ఎవరిదంటే?

image

IPL2024లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. టీమ్ఇండియా తరఫున అదరగొట్టే రోహిత్-కోహ్లీ ద్వయం పొట్టి లీగ్‌లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. RCBపై రోహిత్ శర్మ 574 పరుగులు చేయగా.. MIపై విరాట్ కోహ్లీ 852 పరుగులు చేశారు. ఆర్సీబీపై అత్యధికంగా బుమ్రా 24 వికెట్లు తీశారు. కాగా వాంఖడేలో ఈ 2జట్లు ఇప్పటివరకు 10సార్లు తలపడగా ముంబై 7,ఆర్సీబీ 3సార్లు విజయం సాధించాయి. మరి ఈరోజు గెలుపెవరిది?

Similar News

News November 15, 2024

2800 ఏళ్ల నాటి అమర ప్రేమ ఇది!

image

కొన్ని ప్రేమ కథలు కాలాల్ని దాటి ప్రయాణిస్తాయి. అలాంటిదే ఈ కథ. ఆర్కియాలజిస్టుల కథనం ప్రకారం.. 2800 ఏళ్ల క్రితం ఇరాన్‌లోని టెప్పే హసన్లు ప్రాంతానికి చెందిన ఓ జంట, తమ తండాలో కార్చిచ్చు నుంచి పారిపోతూ ఓ గుంతలో తలదాచుకున్నారు. మృత్యువు వెంటాడటంతో ప్రాణాలు పోయే చివరి క్షణంలో ఒకరినొకరు ముద్దాడారు. 1972లో ఈ ప్రేమికుల అస్థిపంజరాలు వెలుగుచూశాయి. ఆ ప్రాంతం పేరిట వీరిని ‘హసన్లూ ప్రేమికులు’గా పిలుస్తున్నారు.

News November 15, 2024

మోక్షజ్ఞ సినిమాలో విక్రమ్ తనయుడు?

image

నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మూవీలో విలన్ రోల్‌కి తమిళ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్‌ను సంప్రదించారని భోగట్టా. అందుకాయన సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఇక హీరోయిన్‌గా రవీనా టాండన్ కుమార్తె రాశా థడానీని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య క్లైమాక్స్‌లో ప్రత్యేక పాత్రలో తళుక్కుమంటారని మూవీ టీమ్ చెబుతోంది.

News November 15, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే రేపు కూడా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని APSDM తెలిపింది.