News December 18, 2024
కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన 2024!
క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది ఒకటి తర్వాత మరొకటి షాక్‌లు తగులుతున్నాయి. 2024లో ఇప్పటికే టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజాలు రిటైర్మెంట్ ప్రకటించారు. శిఖర్ ధవన్ అన్ని ఫార్మాట్లకూ, దినేశ్ కార్తీక్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈరోజు లెజెండరీ ఆల్ రౌండర్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగారు. దీంతో ఈ ఏడాది క్రికెట్ ఫ్యాన్స్‌కు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Similar News
News January 20, 2025
భారీ జీతంతో ఉద్యోగాలు
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL)లో 642 పోస్టులకు దరఖాస్తు గడువు FEB 16తో ముగియనుంది. ఇందులో జూ.మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులున్నాయి. టెన్త్, మూడేళ్ల డిప్లొమా చేసిన వారు అర్హులు. MTSకు 18-33ఏళ్లు, మిగతా పోస్టులకు 18-30Y వయసు ఉండాలి. జీతం MTSకు ₹16K-₹45K, జూ.మేనేజర్ ₹50K-₹1.60L, ఎగ్జిక్యూటివ్‌కు ₹30K-₹1.20L ఉంటుంది.
వెబ్‌సైట్: <
News January 20, 2025
వరల్డ్ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ
ఇండియన్ ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ టీమ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. కదులుతున్న బైక్స్‌పై అత్యంత ఎత్తైన (20.4 ఫీట్) మానవ పిరమిడ్ నిర్మించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 7 బైక్‌లపై 40 మంది 2కి.మీ మేర ప్రయాణించడంతో ఈ ఘనతను అందుకుంది. ఆర్మీలోని మోటార్ సైకిల్ రైడర్ డిస్‌ప్లే టీమ్‌ను ‘డేర్ డెవిల్స్’ అని పిలుస్తారు.
News January 20, 2025
RGKarVerdict; గరిష్ఠ శిక్ష సరైనది: CBI
హత్యాచార దోషి సంజయ్‌కు ఉరిశిక్ష సరైనదని CBI లాయర్ వాదించారు. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి గరిష్ఠ శిక్షను విధించాలని ప్రార్థిస్తున్నట్లు న్యాయస్థానానికి విన్నవించారు. మరొకరు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండేలా తీర్పు ఉండాలన్నారు. పీజీ మెడిసిన్ చేస్తూ IPS కావాలనుకున్న యువతి జీవితం, కలలను సంజయ్ చెరిపేశాడని CBI లాయర్ వాదించారు.
– మధ్యాహ్నం గం.2:45కి సీల్దా కోర్టు తీర్పు వెల్లడించనుంది.