News March 3, 2025
అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లీ..!

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ మ్యాచులో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వికెట్ తీసిన సందర్భంగా అక్షర్ పటేల్ కాళ్లను తాకేందుకు విరాట్ కోహ్లీ ప్రయత్నించారు. ఇదంతా ఆయన సరదాగా చేశారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇవాళ్టి మ్యాచులో అక్షర్ అన్ని విభాగాల్లోనూ రాణించారు. 47 పరుగులు చేసి ఓ వికెట్ పడగొట్టారు. ఫీల్డింగ్‌లో ఓ అద్భుత క్యాచ్ పట్టారు.
Similar News
News March 21, 2025
సీఎంతో హరీశ్, పద్మారావు భేటీ

TG: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పద్మారావు భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో 15 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని సీఎంకు వారు ఫిర్యాదు చేశారు.
News March 21, 2025
నటి రజిత ఇంట్లో విషాదం

ప్రముఖ నటి రజిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మి(76) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణానికి సంతాపం తెలియజేశారు. రజిత 1986 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తెలుగులో దాదాపు 200 చిత్రాల్లో నటించారు.
News March 21, 2025
ప్రభాస్‌తో నటించడం నా కెరీర్లో ఓ మైలురాయి: మాళవిక

‘రాజాసాబ్’లో రెబల్ స్టార్ ప్రభాస్‌తో నటించడం తన కెరీర్లో ఓ మైలురాయి అని నటి మాళవిక మోహనన్ వ్యాఖ్యానించారు. ‘ప్రభాస్ లాంటి స్టార్ పక్కన నటించడమంటే నాకో మైలురాయే. పాత్రల కోసం ఆయన చూపించే నిబద్ధత స్ఫూర్తినిస్తుంటుంది. అంత స్టార్‌డమ్ ఉన్నా చాలా సింపుల్‌గా, హుందాగా ఉంటారు. నటించే ప్రతి సీన్‌కూ ఓ ఎనర్జీని తీసుకొస్తారు. ఈ సినిమా క్రియేట్ చేసే మ్యాజిక్‌ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపారు.