News May 24, 2024
మీరు చూపించిన ప్రేమకు థాంక్స్: కోహ్లీ

ఈ సీజన్‌లోనూ RCBని ప్రేమించిన ఫ్యాన్స్‌కు కోహ్లీ థాంక్స్ చెప్పారు. ‘ఎప్పటిలాగే మమ్మల్ని ప్రేమించినందుకు, ప్రశంసించినందుకు RCB అభిమానులందరికీ మరోసారి ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో టీమ్ ఫొటో షేర్ చేశారు. IPL2024 ఫైనల్ రేసు నుంచి RCB నిష్క్రమణ తర్వాత ఫ్యాన్స్ కోసం కోహ్లీ చేసిన తొలి పోస్ట్ ఇదే. కాగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్లేఆఫ్స్ చేరిన RCB.. ఎలిమినేటర్‌లో RR చేతిలో ఓడింది.
Similar News
News February 8, 2025
తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సంఘాల సభలో రెడ్డి కులస్థులపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం పోలీసుల వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
News February 8, 2025
శివరాత్రికి అఖండ-2 ఫస్ట్ లుక్?

బోయపాటి డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా అఖండ-2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే మహాకుంభమేళాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం నుంచి బాలయ్య ఫస్ట్ లుక్‌ను ఈ నెలాఖరున విడుదల చేస్తారని సమాచారం. ఈ మూవీలో సంయుక్తా మేనన్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News February 8, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. 10న ఓటర్ల జాబితా

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు SEC కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 5,817 MPTC, 570 ZPTC స్థానాల్లోని ఓటర్ల జాబితాను ఈ నెల 10న విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే ఆయా స్థానాల పరిధిలోని పోలింగ్ స్టేషన్ల వివరాలతో 11న డ్రాఫ్ట్ ప్రకటించాలని ఆదేశించింది. 12, 13న అభ్యంతరాలు స్వీకరించి, 15న తుది జాబితా రిలీజ్ చేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి ఈనెల 15లోగా శిక్షణ <<15393143>>పూర్తిచేయాలంది.<<>>