News March 30, 2024

కోహ్లీ ప్రపంచ రికార్డు

image

నిన్న చిన్నస్వామి స్టేడియంలో KKRతో జరిగిన మ్యాచ్‌‌లో 83* రన్స్ చేసిన విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. ఒకే వేదికలో అత్యధిక T20 రన్స్(3,276) చేసిన ఆటగాడిగా నిలిచారు. 3,239 పరుగులతో ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్-మీర్పూర్) రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్(ట్రెంట్ బ్రిడ్జ్-3,036 రన్స్), బంగ్లా ఆటగాడు తమీమ్ ఇక్బాల్(మీర్పూర్-3,020 పరుగులు) ఉన్నారు.

Similar News

News November 24, 2025

NGKL: జిల్లాలో గత ఐదు రోజులుగా తగ్గిన చలి..!

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గత ఐదు రోజులుగా చల్లి తీవ్రత తగ్గుతుంది. చారకొండ మండలం సిర్సనగండ్లలో 18.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లి, అమ్రాబాద్ 18.7, వెల్దండ 18.8, ఎంగంపల్లి 19.0, తెలకపల్లి, కొండారెడ్డిపల్లి 19.1, నాగర్‌కర్నూల్, బిజినేపల్లి 19.3, కుమ్మెర 19.5, ఊర్కొండ 19.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

News November 24, 2025

ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఇండియన్<<>> హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌ 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE, B.Tech, ME, M.Tech, CA, CMA, ICAI, CFA, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ihmcl.co.in

News November 24, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,25,130కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,14,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.