News March 30, 2024
కోహ్లీ ప్రపంచ రికార్డు

నిన్న చిన్నస్వామి స్టేడియంలో KKRతో జరిగిన మ్యాచ్‌లో 83* రన్స్ చేసిన విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. ఒకే వేదికలో అత్యధిక T20 రన్స్(3,276) చేసిన ఆటగాడిగా నిలిచారు. 3,239 పరుగులతో ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్-మీర్పూర్) రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్(ట్రెంట్ బ్రిడ్జ్-3,036 రన్స్), బంగ్లా ఆటగాడు తమీమ్ ఇక్బాల్(మీర్పూర్-3,020 పరుగులు) ఉన్నారు.
Similar News
News March 8, 2026
దేశంలో మరో UT ఏర్పాటంటూ వార్తలు.. ఖండించిన కేంద్రం

WBలోని సిలిగుడి కారిడార్ సమీపంలో కొత్త కేంద్ర పాలిత ప్రాంతం(UT) ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఓ వార్త వైరలవుతోంది. ఇందులో బిహార్, బెంగాల్‌లోని 6 జిల్లాలు ఉంటాయంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని PIB Fact Check ఖండించింది. కాగా ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాలు సిలిగుడి నుంచే వెళ్తాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాకు ఇది సమీపంలో ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
News March 7, 2026
‘విజయ’ బ్రాండ్‌తో కల్తీ.. AP డెయిరీపై ఆరోపణలు

TG: AP విజయ డెయిరీ తీరుపై తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అమిత్ రెడ్డి మండిపడ్డారు. అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలు ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి వస్తున్నాయని ఆరోపించారు. మేఘనా ఫుడ్స్ తయారు చేస్తున్న నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్ ఉన్నట్లు తెలిపారు. దీనివల్ల తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. AP ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
News March 7, 2026
రేపే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

అహ్మదాబాద్ వేదికగా రేపు భారత్-న్యూజిలాండ్ మధ్య T20WC ఫైనల్ జరగనుంది. దీంతో ప్రైజ్ మనీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ టోర్నీ కోసం ICC మొత్తం ₹120Crను కేటాయించింది. విజేతకు ₹27.48Cr, రన్నరప్‌కు ₹14.65Cr అందుతాయి. సెమీస్‌లో ఓడిన SA, ENGకు ₹7.24Cr చొప్పున, సూపర్-8 వరకు వచ్చిన జట్లకు ₹3.48Cr, టోర్నీలో పాల్గొన్న 20 టీమ్స్‌కు ₹2.29Cr చొప్పున ఇవ్వనుంది.
* రేపటి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.


