News March 17, 2025
కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రుల పిటిషన్ కొట్టివేత

కోల్‌కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించి మళ్లీ CBI విచారణ చేయించాలని ఆమె తల్లిదండ్రులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ జరిపిన కోర్టు దాన్ని కొట్టేస్తూ.. కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ కొనసాగించవచ్చని సూచించింది. గతేడాది ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై అఘాయిత్యం జరిగింది. నిందితుడు సంజయ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.
Similar News
News November 21, 2025
స్వీట్ కార్న్.. కోత సమయాన్ని ఎలా గుర్తించాలి?

తీపి మొక్కజొన్న కండెలపై కొంచెం ఎండిన పీచు, కండెపై బిగుతుగా ఉన్న ఆకు పచ్చని పొట్టు, బాగా పెరిగిన కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ, బాగా పెరిగి, గింజపై గిల్లితే పాలు కారతాయి. ఈ సమయంలో కండెలను కోయడం మంచిది. కోత ఆలస్యమైతే గింజలోని తీపిదనం తగ్గుతుంది. తీపి మొక్కజొన్నను దఫదఫాలుగా విత్తుకుంటే పంట ఒకేసారి కోతకు వచ్చి వృథా కాకుండా పలు దఫాలుగా మార్కెట్ చేసుకోవచ్చు.
News November 21, 2025
భారీగా తగ్గిన వెండి రేటు.. పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ సిల్వర్ రేటు రూ.12,000 పతనమై రూ.1,61,000కు చేరింది. అటు బంగారం ధరల్లోనూ స్వల్ప మార్పులున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,24,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 ఎగబాకి రూ.1,14,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 21, 2025
Hello Day: ఇవాళ్టి స్పెషాలిటీ ఇదే..

ఎదుటివారితో మన సాధారణ పలకరింపులు, ఫోన్ కన్వర్జేషన్లు Helloతోనే మొదలవుతాయి. ఇంత ప్రాధాన్యమున్న ‘హలో’నూ సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ డే ఉంది. అది ఈ రోజే(NOV21). 1973లో ఈజిప్ట్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని రూపొందించారు. ప్రపంచ నాయకులు సంఘర్షణలను కమ్యూనికేషన్‌తో పరిష్కరించుకోవాలనేది దీని ఉద్దేశం. ప్రజలు కూడా కనీసం 10 మందికి శుభాకాంక్షలు చెప్పి ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవచ్చు.


