News March 17, 2025

కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రుల పిటిషన్ కొట్టివేత

image

కోల్‌కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించి మళ్లీ CBI విచారణ చేయించాలని ఆమె తల్లిదండ్రులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ జరిపిన కోర్టు దాన్ని కొట్టేస్తూ.. కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ కొనసాగించవచ్చని సూచించింది. గతేడాది ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై అఘాయిత్యం జరిగింది. నిందితుడు సంజయ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.

Similar News

News April 20, 2025

VIRAL: ఈ 500 తీసుకుని పాస్ చేయండి..!

image

కర్ణాటక చిక్కోడిలో పదో తరగతి జవాబు పత్రాల్లో సమాధానాలకు బదులు కరెన్సీ నోట్లు, కాళ్ల బేరాలు దర్శనమిచ్చాయి. తమను ఎలాగైనా పాస్ చేయాలంటూ కొందరు రూ.500 నోట్లు పెట్టారు. పాస్ చేస్తే ఇంకా డబ్బిస్తామని ఆశ చూపించారు. ఇంకొందరైతే ‘నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది’ అని రాశారు. మరికొంత మంది ‘మీరు పాస్ చేయకపోతే కాలేజీకి వెళ్లలేను.. ప్లీజ్ పాస్ చేయండి’ అని వేడుకున్నారు.

News April 20, 2025

అనితర సాధ్యుడు చంద్రబాబు: పవన్ కళ్యాణ్

image

AP CM చంద్రబాబుకు Dy.CM పవన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘అనితర సాధ్యుడు చంద్రబాబు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై శాంతిభద్రతలు క్షీణించిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేయడం ఆయనలాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. ఆయన విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థల్ని నడిపించే విధానం స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు.

News April 20, 2025

ఆకాశంలో స్మైలీ.. 25న అద్భుతం

image

ఈ నెల 25న ఆకాశం మనల్ని నవ్వుతూ పలకరించనుంది. ఆ రోజున ఉ.5.30 సమయంలో శుక్రుడు, శని గ్రహాలు నెల వంకకు అతి చేరువగా రానున్నాయి. దీంతో త్రిభుజాకారంలో స్మైలీ ఫేస్ కనువిందు చేయనుంది. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా వెల్లడించింది. రెండు గ్రహాలు కాంతివంతంగా ఉంటాయి కాబట్టి కంటితోనే చూడొచ్చని, టెలిస్కోప్, బైనాక్యులర్లతో మరింత క్లారిటీగా కనిపిస్తుందని తెలిపింది.

error: Content is protected !!